డ్రాగన్ గర్జిస్తే.. 2వ దేవర కరుణిస్తాడు.. హ్యాట్రిక్ కిక్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో రాజమౌలి సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. కట్ చేస్తే హిందీ మూవీ వార్ 2 తో హ్యాట్రిక్ కిక్ దొరకుతుందనుకుంటే, బాలీవుడ్ దిక్కుమాలిన బ్యాచ్ ఎన్టీఆర్ జర్నీకి బ్రేక్ వేశారు

Post Published By: dialnews
Updated : 11 March 2026, 6:28 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో రాజమౌలి సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. కట్ చేస్తే హిందీ మూవీ వార్ 2 తో హ్యాట్రిక్ కిక్ దొరకుతుందనుకుంటే, బాలీవుడ్ దిక్కుమాలిన బ్యాచ్ ఎన్టీఆర్ జర్నీకి బ్రేక్ వేశారు. తన ఇమేజ్ ని వాడుకుని, సరుకులేని కథని అంతో ఇంతో అమ్ముకున్నారు.. ఆ మాత్రం అది వసూల్లు రాబట్టిందే, హ్రితిక్ కంటే ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్టే కారణమనే అభిప్రాయముంది. ఏదేమైనా అప్పుడు మిస్ అయిన హ్యాట్రిక్ ఇప్పుడు బలంగా దక్కేలా కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, మూడు మినిమమ్ గ్యారెంటీ సినిమాలు తనకి పడుతున్నాయి. కొన్ని సార్లు కాలం కలిసొస్తే, రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ అవ్వొచచు.. డ్రాగన్ తోపాటు దేవర సీక్వెల్ తో ఎన్టీఆర్ కి కెరీర్ లో ఐదు పాన్ ఇండియా హిట్లు, ఒక పాన్ ఇండియా హ్యాట్రిక్ దక్కేలా ఉంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కి 2027 , 2028 లో వరుసగా మూడు పాన్ ఇండయా లేదంటే పాన్ ఆసియా హ్యాట్రిక్స్ కన్పామ్ అయ్యేలా ఉన్నాయి. తన ప్లానింగ్, రాబోతున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే, వార్ 2 వల్ల మిస్ అయిన హ్యాట్రిక్ కిక్ ఇప్పుడు దక్కేలాఉంది. డ్రాగన్ తోనే ఈ జర్నీ మొదలు కాబోతోంది. కేవలం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీదున్న అంచనాలతోనే, డ్రాగన్ హిట్ అవుతుందని చెప్పలేం..కాని దెబ్బతిన్న స్టార్, బాలీవుడ్ దర్శకులని నమ్మ మోసపోసిన ఎన్టీఆర్, డెఫినెట్ గా తర్వాతీ ప్రాజెక్ట్ లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, త్రివిక్రమ్ విషయంలో చూశాం.. కాబట్టి, డ్రాగన్ విషయంలో తన ప్లానింగ్ మీద అందరికీ గురి ఉంది. ఇక ఎంచుకున్న్ స్టోరీలైన్ తాలూకు ప్రచారాలు చూస్తే, బిలో యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్ల వరద ఖాయంగా కనిపిస్తోంది.

అలాంటిది యావరేజ్ టాక్ వచ్చినా, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పాన్ ఇండియా కాదు పాన్ ఆసియా సునామీనే.. ఎందుకంటే ఇది ఇండోచైనా,భూటాన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కథ. రియల్ ఇన్స్ డెంట్స్ కి ఫిక్షన్ ని కలిపి తీస్తున్న ఒక రియల్ లీడర్ వ్యధ.. అంతేకాదు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టాండర్ట్స్, కథ కోసం తను వేస్తున్న రెండు పాత్రలకోసం ఎన్టీఆర్ ఎంతగా తన హోల్త్ తో రిస్క్ చేస్తున్నాడో, తన లుక్ ని చూస్తే తెలిసిపోతుంది.ఏదో శంకర్ మేకింగ్ లో విక్రమ్ చేసిన ఐ మూవీ లాంటి డిజాస్టరస్ కథైతే చెప్పలేం కాని, రెండు భాగాలుగా రానున్న డ్రాగన్ మీద మాత్రం గట్టి అంచనాలే ఉన్నాయి. ఆతర్వాత వచ్చేది దేవర సీక్వెల్ దేవర2. హిట్ మూవీకి సీక్వెల్ వస్తే, హిట్ అవుతుందా అని అడక్కూడదు.. 670 కోట్ల దేవర వసూళ్లకి ఎన్ని రెట్లు కలెక్సన్స్ రాబడుతుందనే అంచనా వేయాలి.

ఎందుకంటే బాహుబలి, కేజీయఫ్, కాంతరా, పుష్ప ఏదిచూసినా హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ మాత్రమే కాదు, అదో సినీ సునామీ అనేంతగానే రీసౌండ్ చేశాయి. ఇక్కడ అదే జరిగే ఛాన్స్ఉంది. దేవర 2 హిట్ ముందే కన్ఫామ్ అయ్యింది. కాకపోతే కన్ ఫాం కావాల్సింది, ఇది పాన్ ఇండియాకే పరిమితమా, డ్రాగన్ లా పాన్ ఆసియా మీద ఎటాక్ చేస్తుందా అన్నదే తేలాలి...సో త్రిబుల్ ఆర్, దేవర తర్వాత హ్యాట్రిక్ చాన్స్ ని బాలీవుడ్ దర్శకులఅతి తెలివి వల్ల వార్ 2 రిజల్ట్ తో మిస్ చేసుకున్న ఎన్టీఆర్, ఫైనల్ గా డ్రాగన్ రెండు భాగాలు, దేవర సీక్వెల్ తో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 
  • 11 March 2026, 6:28 PM IST