రాజాసాబ్ చేసిన తప్పే ఉస్తాద్.. ఏంటిది ఉస్తాద్…?

పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ గా ఈ వారం బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. కాని ఈ మూవీ ప్రమోషన్ లో తన నుంచి వచ్చిన మాటలు, మిస్ ఫైర్ అయినట్టే కనిపిస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 17 March 2026, 7:20 PM IST

పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ గా ఈ వారం బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. కాని ఈ మూవీ ప్రమోషన్ లో తన నుంచి వచ్చిన మాటలు, మిస్ ఫైర్ అయినట్టే కనిపిస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేసినట్టున్నాడని ట్రోలింగ్స్ కూడా పెరిగాయి. యాంటీ ఫ్యాన్స్ కి ఒకే ఒక్క లింక్ బాగా దొరికింది.. ఉస్తాద్ భగత్ సింగ్ భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ మాటలు నిజంగానే డైలామాలో పడేసేలా ఉన్నాయనేదే అందరినీ ఆలోచనల్లో పడేస్తోంది. ఇంతకి అంతగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లో వదిలిన మాటల తూటాలేంటి? ఎందుకవి మిస్ ఫైర్ అయ్యాయని అంటున్నారు? వాటికి రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీకి ఉన్న లింకేంటి?

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ , ఇండస్ట్రీలో చాలా మందిని షాక్ కి గురిచేస్తున్నాయి. ఇంతలోనే యాంటీ పీఆర్ లేదంటే యాంటీ ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమాతో ముడిపెడుతూ, ఆల్రెడీ ట్రోలింగ్ పెంచేస్తున్నారు. అన్నీంటికి కారణాలున్నాయి... పవన్ అలా అని ఉండాల్సింది కాదనే మాటలే రీసౌండ్ చేస్తున్నాయి..ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో అన్న మాటల్లో ఈ సినిమా రిజల్ట్ ని రివర్స్ చేసే తూటాలున్నాయంటున్నారు. మా ప్రయత్నం మేం చేశాం, అంతిమ తీర్పు మీదే అన్న మాట రీజనబుల్ గానే ఉన్నా, పవన్ అన్న మరో మాటే మిస్ ఫైర్ అయ్యిందనే రెస్పాన్సే పెరుగుతోంది. సినిమా హిట్టవ్వాలనే అంతా పని చేస్తాం, కాని అనుకున్నది అనుకున్నట్టు సినిమా తీసి హిట్ కొట్టడం చాలా కష్టం...ఈ మాటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద పవన్ కి ఎక్కడో కాన్ఫిడెన్స్ సన్నగిల్లిందనే అభిప్రాయానికి కారణమౌతోందా?

మాకు తిండిపెట్టేది సినమా... కాబట్టి అది పోవాలని ఎవరూ చేయరు.. అంతా హిట్టవ్వాలనే చేస్తాం, కాని అన్ని సార్లు పరిస్థితులు అనుకూలించవు కదా... ఈ స్టేట్ మెంట్ తో ఏమని తెలుస్తోంది. ముందే ఈ సినిమా రిజల్ట్ మీద తనకున్న డౌట్ల వల్ల, ఇలాంటి స్టేట్ మెంట్స్ పవన్ ఇస్తున్నాడనుకోవాలా? ఇక్కడే రాజసాబ్ తో అంతా పోలుస్తున్నారు..ఆ మూవీ రిలీజ్ కి ముందు కూడా చేసిన ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఇలాంటి స్టేట్ మెంట్లే ఇచ్చాడు. మేం చేయాల్సింది చేశాం.. మాకైతే నచ్చింది.. ఇక మీరే తేల్చాలన్నాడు.. అప్పుడే ఇది పోయినట్టే అన్న ట్రోలింగ్ జరిగింది. అనుకున్నట్టే రిజల్ట్ రివర్స్ అయ్యింది. కొన్ని సార్లు వాళ్లు చేసిన సినిమా మీద వాళ్లకే నమ్మకం లేకో, క్వాలిటీ తోపాటు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవటం మూలానో, ఇలాంటి స్టేట్ మెంట్స్ ని హింట్స్ రూపంలో ఇవ్వటం ఈమధ్య కామన్ అయిపోయింది.

అచ్చంగా అలానే పవన్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో వీక్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడనే కామెంట్ల దాడి పెరిగింది. మానుంచి తప్పులేకుండా సినిమా చేశాం, అంతిమ తీర్పు ప్రేక్షకులదే, ఇలాంటి స్టేట్ మెంట్స్ ఎక్కడో ఉస్తాద్ మీద పవన్ కి ఉన్న డౌట్లను రిఫ్టెక్ట్ చేస్తోంది. 45 రోజుల్లో సినిమా తీశాం అన్నారు. పవన్ డెప్యూటీ సీఎం అవటం వల్ల, టైం లేక, హరీ హర వీర మళ్లు లా చుట్టేశారా? అందుకే ఇలాంటి స్టేట్ మెంట్స్ పవన్ నుంచి వచ్చాయా? ఇలా సవాలక్ష డౌట్లకు తన స్టేట్ మెంట్లే అనవసరం గా కారణమౌతున్నాయి.. అసలు నిజం ఏంటో ఉగాదికి తేలుతుంది.. మరో రెండు రోజుల్లో రీసౌండ్ చేసే రిజల్ట్ ని బట్టే, పవన్ మాటల వెనకున్న తూటా ఫైర్ అయ్యిందో మిస్ ఫైర్ అయ్యిందో క్లారిటీ వస్తుంంది.

 

Published : 
  • 17 March 2026, 7:20 PM IST