3వ దేవరే కాపాడేది… అంత నమ్మకమా…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవర నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నమూవీనా? అందుకే దీనికి రెండో భాగం కాదు, మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారా? ఎందుకంటే, దేవర సీక్వెలే అతి కష్టం మీద, పట్టాలెక్కుతుందని మొన్నీమధ్యే కన్ఫామ్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 18 March 2026, 9:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవర నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నమూవీనా? అందుకే దీనికి రెండో భాగం కాదు, మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారా? ఎందుకంటే, దేవర సీక్వెలే అతి కష్టం మీద, పట్టాలెక్కుతుందని మొన్నీమధ్యే కన్ఫామ్ అయ్యింది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అంతనమ్మకం ఉంటే, ముందే ఎందుకు సీక్వెల్ కి ఎన్టీఆర్ డేట్లు ఇవ్వలేదు. కొరటాల శివ ఎందుకు అలా వేయిట్ చేయాల్సి వస్తోంది..? ఈ డౌట్లకు సాలిడ్ రీజన్, మూడోవ దేవరే అన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా ఏమైనా అటు ఇటు అయినా కాపాడేందుకు సీన్లోకి పుష్ప3 ప్లానింగ్ ఉంది... అలానే కేజీయఫ్ 2 తర్వాత యష్ చేసే ఏసినమా ఫ్లాపైనా, కేజీయఫ్ 3 ఉండనే ఉంది... కాబట్టి మళ్లీ యష్ గట్టెక్కొచ్చు.. అచ్చంగా దేవర 3 కూడా అలాంటి సేఫ్ జోనేనా? ఆ పాత్ర మీద ఎన్టీఆర్ కి అంత నమ్మకమా?

రెండు దేవర ఇంకా పట్టాలెక్కలేదు. అప్పుడే మూడో దేవర డిస్కర్షన్ వెనక సాలిడ్ రీజనుంది. ప్రజెంట్ డ్రాగన్ మూవీతో బిజీ అయిన ఎన్టీఆర్, దేవర సీక్వెల్ ని తన బ్యాకప్ ప్లాన్ గా ఉంచటానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అసలు దేవర సీక్వెల్ ఉంటుందా; అటకెకకుతుందా అన్నారు. అలాంటి ప్రచారం జరిగిన ప్రతీసారి, లేదు దేవర సీక్వెల్ ఉండి తీరుతుందని ఎన్టీఆర్ చెబుతూనే వచ్చాడు.కట్ చేస్తే ఇప్పుడు రెండో దేవర సెట్లో అడుగు పెట్టకముందే మూడో దేవర చర్చ మొదలైంది. కారణం ఇది ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన ప్రాజెక్ట్. చాలా ఈజీగా తనని గట్టెక్కించగల కాన్సెప్ట్ అన్న ధీమా...? లేదంటే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటం ఎవరి తరం కాలేదు. ప్రభాస్, చరణ్ అంతా రాజమౌళితో హిట్ పడ్డ వెంటనే ఫ్లాప్ ఫేస్ చేసిన స్టార్లే.

అంతేందకు ఎన్టీఆర్ రాజమౌళితో స్టూడెంట్ నెం1., సింహాద్రి, యమదొంగ, లాంటి హిట్ల తర్వాత ఫెల్యూర్స్ ఫేస్ చేశాడు.. అలాంటి తనని రాజమౌలి సెంటిమెంట్ నుంచి బయట పడేసింది దేవర. త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ తో నార్త్ లో తన మార్కెట్ రేంజ్ 670 కోట్లు దాటిందని ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే దాని సీక్వెల్ విషయంలో మరింత జాగ్రత్తలు పెంచాడు. కాని అదే తప్పుగా ప్రచారం చేశారు.. అసలు దేవర సీక్వెల్ ఉండదన్నట్టు గుసగుసలు పెంచారు.రియాలిటీ ఏంటంటే, ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్ సినిమా అంటున్నారు. అయితే డ్రాగన్ తర్వాత దేవర 2, అలానే త్రివిక్రమ్ మూవీ తర్వాత దేవర 3 రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే దేవర2, దేవర 3 రెండూ కూడా ఒకేసారి తెరకెక్కించి, పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకోవాలనేది ఎన్టీఆర్ ఆలోచనని తెలుస్తోంది.

ఈలోపు ఎలాగూ డ్రాగన్ వస్తుంది.. అదేమైనా అటు ఇటైనా దేవర సీక్వెల్ కాపాడుతుంది. తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రిజల్ట్ ఏమాత్రం షాక్ ఇచ్చినా, సేవ్ చేసేందుకు దేవర 3 లైన్లో ఉండనే ఉంది. ఎవరూ ఇలా ఫ్లాప్ పడుతే, తర్వాత హిట్ కోసం సేఫ్ జోన్ చూసుకోరని అనుకోవచ్చు. కాని సినిమా ఫిల్డ్ లో ప్లాన్ బీ లేకుండా పెద్ద హీరోలు, రిస్క్ లు చేసే ఛాన్సేలేదు.బన్నీ కూడా ఆట్లీ మూవీ ఏమైనా తేడా కొడితే, తన మార్కెట్ డ్యామేజ్ కావొద్దని, ఆ తర్వాత పుష్ప 3 ని ముందు ఎనౌన్స్ చేశాడు. యష్ కూడా కేజీయఫ్ 2 తర్వాత చేస్తున్న టాక్సిక్, రామాయణం తర్వాతే కేజీయఫ్ 3 ని ప్లాన్ చేసుకున్నాడు. అలా ఏదైనా ఫ్లాప్ పడితే, సేవ్ చేసేందుకు కలిసొచ్చిన ప్రాజెక్ట్ కి సీక్వెల్ ప్లాన్ చేసుకోవటమే ఉత్తమమార్గంగా కనిపిస్తోంది.

Published : 
  • 18 March 2026, 9:30 PM IST