ఐపీఎల్ కు మూడో స్థానమా ? డబ్ల్యూసీఏపై విమర్శలు…!

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే..టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరిగిన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొచ్చినా ఐపీఎల్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

Post Published By: dialnews
Updated : 21 March 2026, 1:04 PM IST

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే..టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరిగిన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొచ్చినా ఐపీఎల్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు బ్రాండ్ వాల్యూ దూసుకెళుతూనే ఉంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ ఆశపడతాడనటంలో సందేహం లేదు. ప్రతిభ ఉన్న యువ, అన్‌క్యాప్డ్‌ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం దీనికి కారణం. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఐపీఎల్ కు ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య మాత్రం టాప్‌-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లకు సంబంధించి WCA ర్యాంకులు విడుదల చేసింది. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్‌’ లీగ్‌కు అగ్ర స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు రెండో ర్యాంకు ఇచ్చింది.క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్‌బాష్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లకు టాప్‌-5లో చోటు ఇచ్చింది. ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా వంటి పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.

ఈ జాబితాలో ది హండ్రెడ్‌కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్‌కు 68.0 మార్కులు , ఐపీఎల్‌కు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్‌ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌కు 48 మార్కులు వచ్చాయి. గా WCA ప్రకటించిన టాప్‌-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్‌’, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అత్యధిక జట్లు ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉన్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే. అంతేకాదు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయి.

Published : 
  • 21 March 2026, 1:04 PM IST