ఎన్టీఆర్ పేల్చిన బాంబుకు నార్త్ ఇండియాలో రీసౌండ్ పెరిగిపోయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంచుమించు అలాంటి బాంబే పేల్చారు. నిజం చెప్పాలంటే వీల్ల ఒక్క స్టేట్ మెంట్ మొత్తం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. అసలు బాలీవుడ్ ఉందా? మునిగిపోయిందా? అని నార్త్ ఇండియాన్స్ అంతా ప్రశ్నించే పరిస్థితి.. అహంకారం ఎక్కువైయ్యే ఇలా తయారయ్యారని సోషల్ మీడియాలో కామెంట్ల దాడి జరుగుతోంది. ఎన్టీఆర్ అండ్ కో స్టేట్ మెంట్ మాత్రం బాలీవుడ్ ని ఓరేంజ్ లో కుదిపేస్తోంది.. అదేంటో చూసేయండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తోపాటు సూపర్ స్టార్ మహేవ్ బాబు పేల్చిన బాంబుకి, బాలీవుడ్ నుంచే కాదు, శాండిల్ వుడ్ నుంచి కూడా రీసౌండ్ వస్తోంది. అంతటికీ కారనం హిందీ మూవీ ధురందర్ సీక్వెల్ ది రివేంజే... విచిత్రం ఏంటంటే ధురందర్ హిట్టైనప్పుడు హ్రితిక్ రోషన్ అండ్ కో అయినా రియాక్ట్ అయ్యారు. కాని దాని సీక్వెల్ ధురందర్ ది రివేంజ్ రిలీజై 190 కోట్ల పైనే ఓపెనింగ్స్ రాబడితే, బాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్..పిండ్రాప్ సైలెన్స్.. ఖాన్లూ, కపూర్లు, రోషన్ లు, కుమార్లు ఎవరూ రియాక్ట్ కాలేదు. అసలు బాలీవుడ్ కి హిట్లు లేక తికమకపడుతున్న టైంలో 1200కోట్లు రాబట్టింది ధురందర్. దాని సీక్వెల్ వచ్చి ఓపెనింగ్స్ తోనే 200 కోట్ల క్లబ్ లో చేరబోయింది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే నెలరోజుల్లో కలెక్షన్స్ 2వేల కోట్లను దాటేస్తాయి. అంతగా థియేటర్స్ లో ధురందర్ 2 మీద పూనకాలు వస్తుంటే, బాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్..ఇక్కడే ఎన్టీఆర్ తారక మంత్ర మీద డిస్కర్షన్ నడుస్తోంది.
నార్త్ ఇండియాకి చెందిన ఓ యూజర్, బాలీవుడ్ స్టార్స్ కి ఏమైంది, సౌత్ బడా స్టార్లు ధురంధర్ 2 ని మెచ్చుకుంటుంటే, హిందీ స్టార్స్ నిద్రపోతున్నారా అన్నాడు. దానికి ప్రకాశ్ రాజ్ ఈ బాధ్యత తీసుకునే విదానం సౌత్ కి కూడా పాకిందా అని కౌంటర్ వేశాడు.. విచిత్రం ఏంటంటే, కొందరైతే ఇది ధురందర్ 2 ధర్శకుడు ఆదిత్య ధర్ మీద కర్చీఫ్ వేయటమే అనంటున్నారు.బాలీవుడ్ స్టార్స్ కి ఈగో ఎక్కువ అందుకే, తోటి హీరోకి హిట్ పడితే ఓర్చుకోలేరు... అదే సౌత్ స్టార్స్ కి పొలైట్ నెస్ ఎక్కువ, కాబట్టే, పొరుగు హీరోల హిట్స్ కి కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారు.. ఇది స్టేట్ మెంట్ కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి ఎన్టీఆర్, మహేశ్ బాబు, బన్నీ ట్వీట్లకు ఇస్తున్న రెస్పాన్స్.. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ అన్నట్టు ఈ ముగ్గరు ధురందర్ 2 ని తెగ పొగిడేశారు.రణ్ వీర్ సింగ్ పెర్ఫామెన్స్ ని, డైరెక్టర్ మేకింగ్ స్కిల్స్ ని ఆకాశానికెత్తారు.
ఇక్కడే కొందరు నెగెటీవ్ బ్యాచ్, ఈ సినిమా దర్శకుడికి కర్చీఫ్ వేస్తున్న ఆ ముగ్గరంటూ, మహేశ్, ఎన్టీఆర్, బన్నీకి మీద కామెంట్లు పెడుతున్నారు. దానికి కౌంటర్ గా వీళ్ళ ఫ్యాన్స్ రంగంలోకి దిగాల్సిన పనిలేకుండా, నార్త్ ఇండియన్ ఆడియన్సే గట్టిగా తగులుకున్నట్టున్నారు.విచిత్రం ఏంటంటే ధురందర్ మూవీ సీక్వెల్ ది రివేంజ్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి, రణ్ వీర్ సింగ్, లేదంటే దర్శకుడు ఆదిత్య ధర్ హైలెట్ అవ్వాలి.. ఇక్కడ ఎన్టీఆర్, మహేశ్ బాబు పేర్లు మారుమోగుతున్నాయి. ఈ సినిమా టీం ని మెచ్చుకుంటూ వాల్లిచ్చిన స్టేట్ మెంట్స్ వైరలవ్వటం హాట్ టాపిక్ అయ్యిందిప్పుడు.