2027 లో వారణాసి రిలీజ్ కాబోతోంది. 1400 కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేసిన రాజమౌళి, టీం కష్టానికి ఫలితం ఏప్రిల్ లో రాబోతోంది. కాని అదే ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతోంది. ఆలెక్కన వరల్డ్ కప్ డెఫినెట్ గా సినిమాలకు పంచ్ ఇచ్చే ఛాన్స్ఉంది. జనాలు థియేటర్స్ వైపు అడుగులువేయటం కష్టం.. కాని అన్ని సినిమాలు ఒక లెక్క, వారణాసి మరో లెక్క... ఈ మూవీకి మాత్రం క్రికెట్టే ఫేట్ మార్చే ఫ్యాక్టర్. ఔను క్రికెట్ వరల్డ్ కప్ జరిగే టైం కంటే ముందే వారణాసి వస్తోంది కాబట్టి, నోప్రాబ్లమా? అంటే కానేకాదు. వరల్డ్ కప్ జరిగే టైంలోనే వారణాసి విడుదలయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి 2027 లో 1400 కోట్ల రిస్క్, మరింత రిస్క్ లో పడేలా ఉందనుకోవాలి.. కాని అదే క్రికెట్ వల్ల వారణాసికి వరల్డ్ వైడ్ గా బాగా కలిసొచ్చేలా ఉంది.. అదెలా? టేకేలుక్...
సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే... రాజమౌళి డైరెక్షన్ లో వస్తోంది కాబట్టే, పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొడుతుందనే అంచనాలున్నాయి. కాని ఈ సినిమాకు 2027 లో క్రికెట్ వరల్డ్ కప్ తో పెద్ద తలనొప్పే ఉందన్నారు..అక్కడే కథ అడ్డం తిరిగి, అద్రుష్టం అడ్డదిడ్డంగా కలిసొచ్చేలా ఉంది. 2027 ఏప్రిల్ కి వారణాసి రాబోతోందని ప్రియాంక చోప్రా తేల్చేసింది. అదే అఫీషియల్ కాదు.. కాకపోతే కీరవాణి మార్చ్ అన్నాడు.. ప్రియాంక చోప్రా ఏప్రిల్ అంది... ఇక అనాల్సింది దర్శక నిర్మాతలే.. ఐతే అనుకున్న టైంకి రిలీజ్ అయినట్టైతే అసలు 2027 లో జరిగే క్రికెట్ ప్రపంచ కప్ తో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండే ఛాన్స్ లేదు.
కాని ఎప్రిల్ లో వారణాసి రిలీజ్ కష్టమైతే, నెక్ట్స్ రిలీజ్ డేట్ దసరాకే అనుకుంటోంది ఫిల్మ్ టీం. అంటే క్రికెట్ వరల్డ్ కప్ మొదలయ్యే సీజన్ కి కనీసం పదిరోజుల ముందు... అలా చూసినా వారణాసి అప్పుడు రిలీజ్ అయితే, క్రికెట్ వల్ల, థియేటర్స్ వైపు వచ్చే జనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అలా చూస్తే డెఫినెట్ గా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి పంచ్ పడటం ఖాయం..అక్కడే అద్రుష్టం కలిసొచ్చేలా ఉందట. అది కూడా అనుష్క శర్మ రూపంలో... వారణాసిలో అనుష్క శర్మని అంటే క్రికెట్ లెజెండ్ విరాట్ కొహ్లీ భార్యని వారనాసిలో గెస్ట్ లోరోల్ లో తీసుకునే ఛాన్స్ఉందని తెలుస్తోంది. విరాట్ కొహ్లీతో వారణాసి టీం ప్రమోషనల్ డీల్ కూడా అరేంజ్ చేస్తోందట. ఇంతవరకు ఒక సినిమా ప్రమోషన్ కి క్రికెటర్ ని వాడింది లేదు. దానికి తోడు తన వైఫ్ అనుష్క శర్మని గెస్ట్ రోల్ లో తీసుకుని, క్రికెట్ ఫ్యాన్స్ అటెన్షన్ లాక్కునే ప్రయత్నం జరుగుతోందంటున్నారు.
కేవలం అనుష్క శర్మ గెస్ట్ రోల్ వేస్తోనో, విరాట్ కొహ్లీ ఈ మూవీ ప్రమోషన్ కి సాయం చేస్తోనో, వరల్డ్ కప్ తో బిజీ అయ్యే ఆడియన్స్, వారణాసి వైపు అడుగులేస్తారా అంటే కానేకాదు..నిజం చెప్పాలంటే ప్రియాంక చోప్రాకి గ్లోబల్ గా ఉన్న గుర్తింపు, రీచ్, మార్కెట్ పెద్దది. కాబట్టి వరల్డ్ ప్లాట్ ఫాంలో వారణాసికి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఇండియన్ మార్కెట్ లోనే వరల్డ్ కప్ ఎఫెక్ట్ వారణాసి మీద ఉండకూడదనే, ఇలాంటి ఒక చిన్ని ప్రయత్నం చేస్తోందట రాజమౌలి టీం. ఇది కూడా ప్రమోషన్ లో భాగమే అని తెలుస్తోంది. కాని ఏది ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పుడప్పుడే ఈ డీల్ పూర్తవుతుందనుకునే పరిస్థితి లేదు.