గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇప్పటికే విడుదలైన 'చిక్రి చిక్రి', 'రై రై రా రా' పాటలు సోషల్ మీడియాను ఊపేస్తుండటంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
పెద్ది' సినిమా షూటింగ్ దశలో ఉండగానే ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 300 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే 65 కోట్ల వరకు ఆఫర్లు వస్తుండగా, ఆంధ్రాలో 120 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోంది. ఓవర్సీస్ రైట్స్ కూడా 40 కోట్లకు అమ్ముడవడం చరణ్ గ్లోబల్ మార్కెట్ స్టామినాకు నిదర్శనం.ఒకవేళ సినిమా ప్రివ్యూ షోలకు పాజిటివ్ టాక్ వస్తే, మొదటి రోజే 120 నుంచి 150 కోట్లను సాధించే అవకాశం ఉందని అంచనా. హైలైట్ ఏంటంటే దాదాపు దశాబ్దం తర్వాత రెహమాన్ నేరుగా తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే సాంగ్స్ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఉప్పెన'తో తన సత్తా చాటిన బుచ్చిబాబు, ఈసారి ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను 1980ల నాటి కోనసీమ నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడనేది ప్రతీ అప్డేట్ చెప్తూనే ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వంటి హేమాహేమీలు ఉండటం సినిమా రేంజ్‌ను పెంచింది. గేమ్ ఛేంజర్' తర్వాత చరణ్ నుండి వస్తున్న పక్కా లోకల్ అండ్ మాస్ ఫిల్మ్ కావడంతో 'పెద్ది'పై భారీ హైప్ ఉంది. ఏప్రిల్ 30న థియేటర్ల వద్ద మెగా తుపాన్ మొదలవ్వడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' మరి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.