కల్కీ రెబల్ స్టార్ కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీ. బాహుబలి రెండు భాగాలు తనని పాన్ ఇండియా స్టార్ గా మారిస్తే... కల్కీ మూవీ మాత్రం రెబల్ స్టార్ ని పాన్ ఇండియా కింగ్ గా మార్చింది. రాజమౌళి సాయం లేకుండా సొంతంగా తానేంటో ప్రూవ్ చేసుకుని రెండో సారి 1000 కోట్ల క్లబ్ లో ప్రభాస్ ఎంటరయ్యేలా చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఈమూవీ లో మూడు నాటు బాంబులుపేలాయనంటున్నారు. కాదు పేలబోతున్నాయని కూడా అంటున్నారు. అందులో మొదటి నాటు బాంబు జేడీ చక్రవర్తి.. హీరోగా హిట్లు తక్కువుండొచ్చు. కాని టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ కల్ట్ ఫ్యాన్స్ ని కలిగున్న స్టార్ జేడీ.. అలాటి తను ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కల్కీ లోకాసేపే కనిపించిన దుల్కర్ సల్మామ్, కర్ణ 3102 బీసీ లో ప్రభాస్ చేతి కర్రగా మారబోతున్నాడు. అన్నీంటికంటే ముఖ్యమైన నాటు బాంబు సాయి పల్లవి నిజంగా కల్కీ సెట్లో అడుగుపెట్టినట్టే ఉంది... తనని అప్రోచ్ కాలేదని నిర్మాతలన్నా, మరి తనెందుకు సెట్లో అడుగుపెట్టిందో అన్న వార్తలు పెరిగాయి.. ఇంతకి కల్కీ సీక్వెల్ విషయంలో సినిమా టీం ఎందుకింత సీక్రెట్ గా పని కానిచ్చేస్తోంది?
కల్కీ 1200 కోట్లు రాబట్టిన రెబల్ స్టార్ మూవీ. ఇప్పుడు దీని సీక్వెల్ షూటింగ్ అంతా సీక్రెట్ గా , సైలెంట్ గా జరుగుతోంది. ఎవరు సెట్ కొస్తున్నారు. ఎవరి పాత్ర తాలూకు సీన్లు షూట్ చేస్తున్నారు.. ఇవేవి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ లేవు. అప్ డేట్స్ కూడా అఫీషియల్ గా రావట్లేదు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సీన్లు తెరకెక్కించింది ఫిల్మ్ టీం.ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కి తోడుమలయాళ స్టార దుల్కర్ సల్మాన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ లో కాసేపే కనిపించిన తను, ఈ సారి లెంథీ రోల్ వేస్తున్నట్టున్నాడు. ఇక టాలీవుడ్ కమల్ హాసన్ గా ఫోకస్ అయిన జేడీ చక్రవర్తి కల్కీ సీక్వెల్, కర్ణ 3102 బీసీలో స్పెషల్ రోల్ వేస్తున్నాడనే మాటలు నిజమౌతున్నాయి. ఈరెండు చాలా గొప్ప మార్పులే... ఇవే అనుకుంటే ఇందులో సాయిపల్లవి కనిపించటం ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదని తేలింది.ఎందుకంటే మొన్నటి వరకు సాయిపల్లవి ఇందులో నటిస్తోందన్న వార్త రూమర్ అన్నారు. ప్రొడక్షన్ టీం కూడా సాయిపల్లవిని సంప్రదించలేదంది.. సాయిపల్లవి కూడా ఈ వార్తని లైట్ తీసుకుంది. అంతేకాదు, హిందీ లో అమీర్ ఖాన్ కొడుకుతో ఒక సినిమా, రణ్ బీర్ కపూర్ తో రామాయణం రెండు భాగాలో బిజీ అయ్యింది. ఇక తనేం కల్కీ 2లో కనిపిస్తుందన్నారు.
కాని దీపికి పదుకొనేని గెంటేశాక, తను చేసిన సుమతి పాత్రకి, రిప్లేస్ మెంట్ అయితే, సాయిపల్లవినే బెటర్ అన్న డిస్కర్షన్ పెరిగింది. లేడీ పవర్ స్టార్ గా తనకున్ని ఇమేజ్, నటిగా తనకున్న సామర్ద్యం, సినిమాకు ప్లస్ అవుతుందనే అభిప్రాయం తో, ఫిల్మ్ టీం తనని సంప్రదించటం జరిగిందట. కాకపోతే సైలెంట్ గా తను సెట్లోకొచ్చి నటించి వెళుతోందా? తన పాత్ర తాలూకు షూటింగ్ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదా.. అన్న సంగతి ఇంకా తేలలేదు.ఏదేమైన కల్కీ 2 టైటిల్ ని కర్ణ 3102 బీసీగా మార్చటమే షాకింగ్ న్యూస్.. ఎందుకంటే కాసేపు కర్ణగా కనిపిస్తేనే, రెబల్ స్టార్ పుణ్యమాని 1200 కోట్ల వసూళ్లు వరదొచ్చింది. అదే కల్కీ సీక్వెలే కర్ణ టైటిల్ తో వస్తోందంటే, సినిమా అంతా రెబల్ స్టార్ కర్ణుడిగానే కనిపిస్తాడనే అంతా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలాంటిది, సీన్లోకి జేడీ చక్రవర్తీ, దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి లాంటి న్యాచురల్ పెర్ఫార్మర్స్ వస్తే, సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.