ఎవరైనా లెగ్గు పెడితే, మూవీ మసే అనగానే ఐరన్ లెగ్ అంటాం.. కాని మరొకరు లెగ్గు పెడితే మాత్రం వేలకోట్ల వర్షమే...తనే హిందీ స్టార్ సంజయ్ దత్.. వెటరన్ సూపర్ స్టార్ అయిన ఈ బాలీవుడ్ హీరో, ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి కనక వర్షం కురిపించబోతున్నాడా? డ్రాగన్ లో ఎన్టీఆర్ కోసం ఫైట్ చేయబోతున్నాడా? రీసెంట్ గా ధురందర్ లో విలన్ రోల్ లో కనిపించాడు. కేజీయఫ్ లో నెగెటీవ్ రోల్ వేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం పెద్ద యుద్దమే చేయబోతున్నాడు. అందుకోసం తన కెరీర్ లోనే అత్యధికంగా 50రోజుల డేట్లు నాన్ హిందీ మూవీ కోసం కేటాయించాడు.. అక్కడే అర్ధమౌతోంది, డ్రాగన్ లో సంజయ్ దత్ ఎంత ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడో... ఇంతకి 1000 కోట్ల వసూల్లు రాబట్టే సినిమాలే చేస్తున్న సంజయ్ దత్ డ్రాగన్ లో వేస్తున్న రోలేంటి? తన వల్ల ఎన్టీఆర్ కి సెంటిమెంటల్ గా కలిసొచ్చేదేంటి?
బాలీవుడ్ వెటరన్ హీరో, ప్రజెంట్ విలన్ అయిన సంజయ్ దత్ ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. తండ్రి సమానుడనిపించే పాత్రేదో చేసేందుకు 50 రోజుల డేట్లిచ్చాడని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ కి రెండు రకాలుగా కలిసొస్తోంది. ఒకటి నార్త్ ఇండియా మార్కెట్ లో సంజు బాబాకి ఉన్న డిమాండ్.. డ్రాగన్ కి కలిసొస్తుంది.ఇక రెండో రకంగా చూస్తే ఈ నటుడు ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ 1000 కోట్ల వసూళ్ళ వరదలే.. అలా సెంటిమెంట్ గా కూడా కలిసొస్తుంది. ఆమద్య కేజీయఫ్ 2 లో విలన్ గా కనిపించాడు.
అది 1400 కోట్లు రాబట్టింది. కట్ చేస్తే బాలీవుడ్ బాద్ షా షారుక్ తో కలిసి జవాన్ చేశాడు. అది 1100 కోట్లు రాబట్టింది. తర్వాత ధురందర్ 1 చేస్తే అది 1200 కోట్లు రాబట్టింది. ధురందర్ 2లో కూడా తన సీన్లు కొన్ని ఉండటంతో అది కూడా 1200 కట్లు రాటి, 2 వే లకోట్ల వేటలో పడిందంటున్నారు.అంటే పాన్ ఇండియా లెవల్లో సంజయ్ దత్ ఎక్కడ లెగ్గు పెట్టినా వందలు , వేల కోట్ల వర్షమే వస్తోంది. కాబట్టే డ్రాగన్ లో తను నెగెటివ్ కాదు, పాజిటివ్ రోల్ వేస్తున్నాడంటే, అది కూడా కలిసొచ్చే అంశంగ కనిపిస్తోంది. కాకపోతే రాజసాబ్ లో మాత్రం సంజయ్ దత్ ఎంట్రీ ఉన్నా అక్కడే బాక్సాఫీస్ లో ఏది కలిసి రాలేదు. కాని తమిల లియో 600 కోట్లు వచ్చాయి.
యారవేజ్ గా చూస్తే రాజాసాబ్ తప్ప అన్ని సినిమాల్లో సంజయ్ దత్ ఎంట్రీ పాన్ ఇండియా సినిమా ల లెవల్ ని పెంచేసింది. 1000 కోట్ల స్టార్ గా మార్చేసింది. ఓరకంగా వెయ్యికోట్ల క్లబ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు సంజయ్ దత్. కేవలం సెంటిమెంట్ పరంగానే తన ఎంట్రీ గొప్పదనలేం. తనకి నార్త్ ఇండియాలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టే, తన ఎంట్రీ ఏ మాస్ మూవీనైనా, ఊర మాస్ గా మార్చేస్తుంది.అందుకే డ్రాగన్ లో ఇద్దరు డ్రాగన్లుగా ఎన్టీఆర్ కనిపించటమే కాదు, ఒక డ్రాగన్ కి పినతండ్రిగానో, స్టెఫ్ ఫాదర్ గానో మొత్తానికి పాజిటివ్ రోల్ లోనే సంజయ్ దత్ కనిపించే ఛాన్స్ఉందని ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ టీజర్ విజువల్స్ లో తనున్నాడనే వార్త వైరలైంది.