Top story:ట్రంప్‌ ఇలా బుక్ అయ్యాడేంట్రా…? ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వచ్చేది లేదు… అమెరికాకు బిగ్ హ్యాండ్ ఇచ్చిన నెతన్యాహు…!

ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అవసరమైన సైన్యాన్ని ఎప్పుడో అమెరికా తరలించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, USS ట్రిపోలిలో ఉన్న దాదాపు 3వేల 500 మంది మెరైన్‌లు, నావికులు రీసెంట్‌గా పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఓవరాల్‌గా పశ్చిమాసియాలో దాదాపు 57వేల మంది

Post Published By: dialnews
Updated : 1 April 2026, 12:10 PM IST

ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు అవసరమైన సైన్యాన్ని ఎప్పుడో అమెరికా తరలించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, USS ట్రిపోలిలో ఉన్న దాదాపు 3వేల 500 మంది మెరైన్‌లు, నావికులు రీసెంట్‌గా పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఓవరాల్‌గా పశ్చిమాసియాలో దాదాపు 57వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. గత 20 ఏళ్లలో ఇది అమెరికా అతిపెద్ద సైనిక సమీకరణ ఇది.USS ట్రిపోలిలో రవాణా, దాడి కోసం ఉపయోగించే అనేక రకాల విమానాలు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. అలాగే సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, అమెరికా F-35 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. మెరైన్‌లు రాకముందే అమెరికా ఈ ప్రాంతంలో 2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, పలు వార్ షిప్స్.. వేలాది సైనికులను మోహరించింది. పక్కా ప్లాన్ ప్రకారమే 57 వేల మందిసైనికులను పశ్చిమాసియాలో మోహరించారు. ఇరాన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు ట్రంప్ ఏ రేంజ్‌లో ప్రిపేర్ అయ్యాడో ఈ లెక్కలే చెబుతున్నాయి. కానీ, ఇంత చేసీ ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు దిగే ధైర్యం ఆ దేశం చేయడం లేదు... ఎందుకు? ఎందుకంటే, ఈ ఆపరేషన్‌కు తాము రాబోమని ఇజ్రాయెల్ హ్యాండ్ ఇచ్చింది.

గ్రౌండ్ ఆపరేషన్ కోసం తమ సైన్యం ఇరాన్ వెళ్లదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం, దేశ సరిహద్దుల్లో భద్రతను కాపాడుకోవడం, లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఫోకస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన వైమానిక, నేవీ కార్యకలాపాలను కొనసాగిస్తుందని, అయితే ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ చర్యల్లో పాలు పంచుకోదని ఆ దేశ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్రరాజ్యానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం భారం అమెరికాపై పడే ఛాన్స్ ఉంది. కేవలం అమెరికానే రంగంలోకి దిగి ఇరాన్ సైన్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఈ విషయం ట్రంప్‌ను కలవరపెడుతుంది. ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక ప్రకారం.. అమెరికా ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే, ఆ సైన్యం ఒక్కటే ఈ మిషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, అమెరికాకు సాంకేతిక సహకారం, ఇంటెలిజెన్స్ ద్వారా సహాయం చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ఎందుకు వెనుకడుగు వేస్తోంది.

ఇజ్రాయెల్ నుండి ఇరాన్ దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా భూభాగాలు ఉన్నాయి. గాలిలో దాడులు చేయడం సులభమే కానీ, భారీ ఎత్తున సైన్యాన్ని, ట్యాంకులను ఇరాన్ సరిహద్దుల వరకు తీసుకెళ్లడం ఇజ్రాయెల్‌కు లాజిస్టికల్ పరంగా పెను సవాలు. ఇరాన్‌పై నేరుగా భూతల దాడి జరిగితే, అది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్-సిరియాలోని ఇతర గ్రూపులు ఏకకాలంలో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాతో పోరాడుతోంది. ఇరాన్ విస్తీర్ణంలో చాలా పెద్దది. చాలా వరకూ పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఇరాన్ సైన్యాన్ని వారి సొంత గడ్డపై ఢీకొట్టడం భారీ ప్రాణనష్టంతో కూడుకున్న పని. అందుకే, ఈ విషయంలో ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరిస్తోంది అన్నది విశ్లేషకుల మాట. నిజానికి.. ఇరాన్‌లోని యురేనియం నిల్వలను ఎత్తుకురావాల్సిన అవసరం అమెరికాకంటే ఇజ్రాయెల్‌కే ఎక్కువ ఉంది. కానీ, ఈ విషయంలో తమ దేశాన్ని రక్షించుకుంటూనే ఇరాన్‌పై వైమానిక దాడులకు పరిమితం అవుతామని స్పష్టం చేస్తోంది. కానీ, ఈ పరిణమాలు ఇరాన్‌కు అనుకూలంగా మారే ప్రమాదం లేకపోలేదు. కానీ, ఈ పరిణామాలు ఇరాన్‌కు ఎలా కలిసి రాబోతున్నాయి?

ప్రత్యక్ష దాడి ముప్పు తగ్గినప్పుడు, ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత రహస్యంగా, వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రష్యా, చైనాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుని, ఇజ్రాయెల్-అమెరికా కూటమిని ఒంటరి చేసే ప్రయత్నం ఇరాన్ చేయవచ్చు. మొత్తానికి, ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని సరిహద్దుల అవతల విస్తరించడానికి, తన రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవడానికి టైం దొరికినట్లవుతుందనేది రక్షణ నిపుణుల అంచనా. ఇదే సమయంలో అమెరికా సింగిల్‌గా గ్రౌండ్ ఆపరేషన్‌కు దిగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందుకే, అమెరికా సైనికులను ఉద్దేశించి నరకానికి స్వాగతం అంటూ సవాల్ చేస్తోందా దేశం. సింగిల్‌గా సీన్‌లోకి దిగితే బొక్కబోర్లా పడటం ఖాయం అని అమెరికాకు కూడా తెలుసు. అందుకే బంకర్ బస్టర్లతో ఇస్ఫహాన్‌పై విరుచుకుపడింది. ఇరాన్ ఆయుధ పరంగా బలహీనపడిన తర్వాత గ్రౌండ్ ఆపరేషన్‌కు దిగొచ్చు అనేది అమెరికా ప్లాన్‌గా కనిపిస్తోంది.

 

Published : 
  • 1 April 2026, 12:10 PM IST