మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ రేంజ్ ఎంత? 35 వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కాకపోతే పాన్ వరల్డ్ లెవల్లోనే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసినా, 30 వేల తియేటర్స్ మాత్రం పూర్తిగా ఆసియాకే పరిమితం.. అంటే వరల్డ్ వైడ్ గా ఆసియాలోనే 30 వేల థియేటర్స్ లో ఈ మూవీ రాబోతోంది. మిగతా దేశాల్లో 5 వేల థియేటర్స్ లో డ్రాగన్ దరువు కన్ఫామ్ అవుతోంది. ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు కూడా... కాని ఇక్కడ ఒకే ఒక్క విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఎంతగా ఈ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా మార్చాలనుకున్నా, మూవీ టీం టార్గెట్ మాత్రం ముందు ఆసియానే.. చైనా, జపాన్, కొరియా ఈ మూడు దేశాలను కొల్లగొట్టాలని ఎందుకు డ్రాగన్ టీం భీష్మించుకు కూర్చుంది... అంతా వరల్డ్ మార్కెట్ అంటుంటే, ఈ మూడు ఆసియా దేశాలనే డ్రాగన్ ఎందుకు భారీగా టార్గెట్ చేసుకుంటోంది.. రాజమౌళికే పాఠం చెప్పే ప్రయంత్న ప్రశాంత్ నీల్ చేస్తున్నాడా? డెఫినెట్ గా డ్రాగన్ ప్లానింగ్ వారనాసి టీం ని కూడా ఆలోచనల్లో పడేస్తోందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈమూవీ మొదటి భాగం 690 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండో భాగానికి 800 కోట్ల పైనే బడ్జెట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ 40శాతం షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా మలయాళ స్టార్ టొవినో థామస్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందోచెప్పటం వల్ల, ఈ ప్రాజెక్ట్ మీద మళ్లీ చిత్ర విచిత్రమైన ప్రచారాలు మొదలయ్యాయి.కాని 35 వేల థియేటర్స్ లో డ్రాగన్ మూవీ రిలీజ్ అవటం కన్పామ్ అయ్యిందన్న వార్త మాత్రం వైరల్ అయ్యింది. ఇంతవరకు దేవర ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 వేల థియేటర్స్ లోరిలీజ్ అయ్యింది. ఇక వార్ 2 మూవీ అయితే 7 వేల థియేటర్స్ వరకు రిలీజ్ అయితే, త్రిబుల్ ఆర్ మాత్రం వరల్డ్ వైడ్ గా 10 వేలథియేటర్స్ లో విడుదలైంది. ఇలా చూస్తే ఇందుకు మూడున్నర రెట్ల థియేటర్స్ లో డ్రాగన్ రిలీజ్ ఖాయమైంది.
ఇదే సెన్సేషన్ అంటే, ఇందులో 30 వేల థియేటర్స్ పూర్తిగా ఆసియా దేశాల్లోనే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇండియాలో 5 వేల థియేటర్స్ , చైనాలో 20 వేల థియేటర్స్, జపాన్, కొరియా, మలేషియా, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నం వీటన్నీంట్లో కలిపి మరో 5 వేల థియేటర్స్ లెక్కతేలుతోంది. ఇక యూఎస్, యూరప్ ,ఆస్ట్రేలియా థియేటర్స్ లెక్కేస్తే అవో 5 వేల కోట్లు..మొత్తంగా టార్గెట్ చూస్తే చైనా, జపాన్, కొరియా ఇలా సౌత్ ఆసియా మార్కెట్ నే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం యూఎస్, యూరప్ అండ్ కో దేశాల్లోని 5 వేల థియేటర్స్ తో పోలిస్తే 6 రెట్లు ఆసియా కంట్రీల్లోనే డ్రాగన ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంటే క్లియర్ కట్ గా చైనా, జపాన్, కొరియా ఇలా ఆసియా మార్కెట్టే అసలు టార్గెట్ గా పెట్టుకుంది డ్రాగన్ టీం.
కంటెంట్ కూడా ఇండో, చైనా, బూటాన్ ట్రై జంక్షన్ చుట్టూ తిరుగుతుందంటే, ఆటోమేటిగ్గా, టైటిల్ కి తగ్గట్టే కంటెంట్ కూడా సౌత్ ఆసియా పరిస్థితుల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చైనా, జపాన్, కొరియాల్లో మార్కెట్ క్రియేట్ అయితే, హాలీవుడ్, యూరప్ లో ఎన్టీఆర్ సినిమాలకు రీచ్ పెరుగుతుంది. కొరియన్ కంటెంట్ అంటేనే వరల్డ్ వైడ్ గా పాపులరైంది. కాబట్టి వాళ్లనే ఇంప్రెస్ చేస్తే, అక్కడి మార్కెట్ లో జెండా పాతితే, పరోక్షంగా ప్రపంచ మార్కెట్ లో బ్రాండింగ్ ఈజీ అయిపోతుంది. అందుకే డ్రాగన్ 1 ని పాన్ఆసియాగా, డ్రాగన్ సీక్వెల్ ని పాన్ వరల్డ్ మూవీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. 35 వేల థియేటర్స్ లో డ్రాగన్ రిలీజ్ అయితే, వారణాసి, రామాయణం తో పాటు ప్రపంచ మార్కెట్ లో ఇది పోటీ పడినట్టౌతుంది.