Top story:షాకింగ్ ట్విస్ట్, ట్రంప్ కు బ్రిటన్ ప్రధాని బిగ్ షాక్…ఇరాన్ పర్యటనకు బ్రిటన్ ప్రధాని, ఇస్లామిక్ రిపబ్లిక్ తో రాజీకి అడుగులు… రేయ్ ట్రంప్ నిన్ను నమ్ముకుంటే మునిగిపోతాం…!

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్, ఇప్పుడు తన ఉనికి కోసం, చమురు కోసం ఇరాన్ గడప తొక్కాల్సిన దుస్థితికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహం వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని గుర్తించిన బ్రిటన్ ప్రధాని

Post Published By: dialnews
Updated : 24 April 2026, 2:01 PM IST

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్, ఇప్పుడు తన ఉనికి కోసం, చమురు కోసం ఇరాన్ గడప తొక్కాల్సిన దుస్థితికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహం వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని గుర్తించిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్, ఇప్పుడు నేరుగా ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం, ఇరాన్ సంక్షోభం కొనసాగే కొద్దీ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాని ఇప్పటికే హెచ్చరించారు.

బ్రిటన్ ఇరాన్ విషయంలో ఇంతలా దిగిరావడానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందించిన బ్రిటన్, తన సొంత ఖజానాను ఖాళీ చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుండి సరఫరా అయ్యే గ్యాస్ నిలిచిపోవడంతో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్‌తో గొడవకు దిగితే ఆ దేశం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ వృద్ధి అంచనాలను ఇప్పటికే భారీగా తగ్గించింది.

IMF నివేదిక ప్రకారం, G7 దేశాలన్నింటిలోకెల్లా ఈ యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోయేది బ్రిటనే. ఏప్రిల్ 22 నాటికి బ్రిటన్ లో పెట్రోల్ ధర లీటరుకు 1.57 పౌండ్లు, , డీజిల్ 1.90 పౌండ్లకు చేరుకుంది. ఇది 2022 నాటి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన సంక్షోభం కంటే ప్రమాదకరంగా మారుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. సామాన్యుడికి కరెంటు బిల్లులు కట్టడం భారమైంది, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఒక యుద్ధానికే తట్టుకోలేక విలవిలలాడుతున్న బ్రిటన్, ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం అంటే అది దేశ ఆత్మహత్యతో సమానమని స్టార్మర్ ప్రభుత్వం భావిస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం బ్రిటన్ రక్షణ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు సరఫరా ఇప్పుడు ఇరాన్ చేతుల్లో చిక్కుకుంది. ఏప్రిల్ 22న ఇరాన్ దళాలు ఎంఎస్సీ ఫ్రాన్సియా సహా మరో నౌకను ఇరాన్ ఆపేసింది. ఈ రెండు సరుకు రవాణా నౌకలను అదుపులోకి తీసుకోవడం బ్రిటన్ పాలిట మరణశాసనంగా మారింది. ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ చమురు ధరలు లీటరుకు రూ. 25-28 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చమురు చుక్క కోసం ఇరాన్ వైపు చూడాల్సిందే అన్న వాస్తవం బ్రిటన్‌ను రాజీకి ప్రేరేపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న 'అమెరికా ఫస్ట్' విధానం బ్రిటన్ ను ఏకాకిని చేస్తోంది. "ట్రంప్ ను నమ్ముకుంటే నాశనం అయిపోతాం" అనే భయం ఇప్పుడు బ్రిటన్ ప్రధానిని ఇరాన్ వైపు అడుగులు వేయించింది. ట్రంప్ ప్రభుత్వం కేవలం ఇరాన్ అణు కార్యక్రమంపైనే దృష్టి పెట్టగా, బ్రిటన్ మాత్రం తమ ప్రజల జేబులను దెబ్బతీస్తున్న ధరల పెరుగుదల మరియు నౌకల భద్రతపై ఆందోళన చెందుతోంది.

అందుకే ఇరాన్ తో యుద్ధం కంటే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని స్టార్మర్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. అమెరికా అజెండాకు దూరంగా జరిగి, ఇరాన్‌తో సొంతంగా ఒప్పందం కుదుర్చుకుని తమ నౌకలను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని బ్రిటన్ చూస్తోంది. నివేదిక ప్రకారం, ట్రంప్ వైఖరి వల్ల బ్రిటన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తో సన్నిహితంగా ఉండాలని భావిస్తోంది. "ట్రంప్‌ను నమ్ముకుంటే నాశనం అయిపోతాం" అనే నినాదం ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ట్రంప్ తన స్వప్రయోజనాల కోసం యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని, దానివల్ల నష్టపోయేది బ్రిటన్ లాంటి మిత్రదేశాలేనని లండన్ గుర్తించింది. అందుకే అమెరికా నీడ నుండి బయటకు వచ్చి, ఇరాన్‌తో నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్టార్మర్ ప్లాన్ చేస్తున్నారు. ఇది అగ్రరాజ్యం అమెరికాకు కోపం తెప్పించినా, తమ దేశ ప్రజల ఆకలి చావులను, చమురు కష్టాలను తీర్చడానికి ఇరాన్‌తో రాజీ పడక తప్పని స్థితిలో బ్రిటన్ ఉంది. ప్రధాని స్టార్మర్ ఏప్రిల్ 8 నుండి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మరియు ఖతార్ వంటి దేశాల్లో పర్యటించారు.

ఇరాన్‌తో నేరుగా కాకుండా, ఆ ప్రాంతంలోని మిత్రదేశాల ద్వారా చర్చలు జరిపారు. అమెరికా ఇరాన్ పై జరిపే దాడులకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతించింది. దీనిని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తూ, బ్రిటన్ నేరుగా యుద్ధంలో పాల్గొంటోందని ఆరోపించింది. దీనివల్ల బ్రిటన్ సొంత భూభాగం మరియు ఆస్తులపై ఇరాన్ క్షిపణి దాడులు జరిగే ప్రమాదం ఉందని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిపించడం ఈ పర్యటనలో ప్రధాన అజెండా.

ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధించడం వల్ల బ్రిటన్‌లో చమురు ధరలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కేవలం చమురుకే పరిమితం కాలేదు. గల్ఫ్ సంక్షోభం వల్ల బ్రిటన్ లో కూరగాయలు, మాంసం మరియు శీతల పానీయాల సరఫరాకు ఆటంకం ఏర్పడి, తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని బీబీసీ నివేదించింది. ఇరాన్‌పై దాడుల్లో అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసినప్పటికీ, బ్రిటన్ మాత్రం ఈ యుద్ధంలో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది.

తమ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజీ మార్గమే ఉత్తమమని స్టార్మర్ భావిస్తున్నారు. చమురు కష్టాల నుండి గట్టెక్కడానికి, హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించడానికి ప్రధాని స్టార్మర్ ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ మరియు ఖతార్ వంటి దేశాల్లో పర్యటించారు. అమెరికా దూకుడుకు భిన్నంగా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కలిసి హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రక్షణ కోసం ఒక మల్టీ నేషనల్ మిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనిపై చర్చించడానికి ఏప్రిల్ 22 నుండి లండన్ లో 30కి పైగా దేశాల సైనిక నిపుణులతో సమావేశాలు జరుగుతున్నాయి. అమెరికాతో సంబంధం లేకుండా ఇరాన్‌తో నేరుగా మాట్లాడి తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

Published : 
  • 24 April 2026, 2:01 PM IST