అవును. కెసిఆర్ తన ప్రాణపదమైన టిఆర్ఎస్ అనే పదాన్ని కోల్పోయారు. ఆయన నోటి నుంచి... ఆయన పార్టీ నేతలు నోటి వెంట టిఆర్ఎస్ అనే పదం ఇక వినిపించదు. తెలంగాణ రాష్ట్ర సమితి... టి ఆర్ ఎస్, 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపించింది. పదేళ్ల పాటు అధికారాన్ని ఇచ్చింది. ఒక చరిత్ర సృష్టించింది. టిఆర్ఎస్ అంటే ఒక ఎమోషన్. ఒక భావోద్వేగం. నాలుగు కోట్ల మంది ప్రజల నాలుకలపై కెసిఆర్ గుర్తుకు రాగానే పలికే పదం టిఆర్ఎస్. అలాంటి టీఆర్ఎస్ అనే పదాన్ని కెసిఆర్ నుంచి ఆయన కుమార్తె కవిత ఎత్తుకెళ్లిపోయారు. 2023 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ని వదులుకొని, బి ఆర్ ఎస్ భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారు కెసిఆర్. అక్కడి నుంచే టి ఆర్ పతనం మొదలైంది. ఇప్పుడు కెసిఆర్ వదులుకున్న టిఆర్ఎస్ నీ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో సొంతం చేసుకున్నారు కవిత.
నిజానికి టిఆర్ఎస్ టైటిల్ని వదులుకొని బి ఆర్ ఎస్ అనే పేరు పెట్టి తప్పు చేశామని, త్వరలో మళ్లీ బి ఆర్ ఎస్ ని టిఆర్ఎస్ గా మార్చేద్దాం అనుకుంటున్న సమయంలో.... గద్ద కోడి పిల్ల నీ ఎత్తుకుపోయినట్లు చడిచప్పుడు లేకుండా టక్కమని టిఆర్ఎస్ టైటిల్ ఎత్తుకు పోయింది కవిత.తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నిర్భవించింది టిఆర్ఎస్.14 ఏళ్ల ఉద్యమం నడిపించింది. రెండుసార్లు అధికారాన్ని అనుభవించింది గులాబీ జెండా. దీంతో కెసిఆర్ లో అత్యాశ మొదలైంది. భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి జాతీయస్థాయి కి ఎదుగుపోవాలనుకున్నాడు. టిఆర్ఎస్ ని వదులుకొని బి ఆర్ ఎస్ గా పార్టీని మార్చేశాడు కేసీఆర్. ఈ ప్రయోగం దారుణంగా దెబ్బ కొట్టింది.
2023 ఎన్నికల్లో ఓడిపోయి 29 స్థానాలకే పరిమితం అయిపోయింది బి ఆర్ ఎస్. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లోనూ ఓడిపోయి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. జీరోగా మిగిలిపోయింది. ఏ తెలంగాణ అనే పదాన్ని చూసి జనం ఉద్యమించా రో , ఏ తెలంగాణ పదం వల్ల రాష్ట్రాన్ని సాధించారు ఆ పదాన్ని వదిలి పెట్టేసరికి కేసీఆర్. దానివల్ల తీవ్రంగా నష్టపోయారు. మధ్యకాలంలో టిఆర్ఎస్ ని మళ్లీ పార్టీకి పేరుగా పెట్టుకోవాలని.... పునర్ వైభవం సాధించాలని యోచించడం మొదలుపెట్టారు బి ఆర్ ఎస్ పెద్దలు. కేటీఆర్ ఇదే విషయాన్ని చూచాయిగా మీడియాకి చెప్పారు కూడా. కానీ ఇంతలోనే అనూహ్యంగా ఆ టైటిల్ని ఎత్తుకెళ్లిపోయింది కవిత. టిఆర్ఎస్ అనే టైటిల్ కవితకు ఎంతవరకు లభిస్తుందో తెలియదు గానీ, దాన్ని కోల్పోయి దానిని కెసిఆర్ మాత్రం సర్వం కోల్పోయారు. కూతురా టైటిల్ ని ఎత్తుకుపోయి.... కెసిఆర్ ని ప్రతిరోజు మానసికంగా వేధిస్తోంది.