చేతులు మారిన రాజస్థాన్ ఫ్రాంచైజీ… డీల్ విలువ రూ.15,600 కోట్లు…!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీ

Post Published By: dialnews
Updated : 4 May 2026, 7:50 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 15,600 కోట్లుగా ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ డీల్స్‌లో ఒకటిగా చెబుతున్నారు.
నిజానికి రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ముందుకొచ్చింది.

వీరు 1.63 బిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేశారు. అయితే, నిధుల సేకరణలో సమస్యలు తలెత్తడం, డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో పలు సమస్యల కారణంగా ఈ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కల్‌ సోమానీ రేసు నుండి తప్పుకోవడంతో మిట్టల్ కుటుంబం రంగంలోకి దిగింది. వీరికి తోడుగా అదర్ పూనావాలా కూడా భాగస్వామిగా మారి ఈ టీమ్ ను తమ సొంతం చేసుకున్నారు.మిట్టల్ కుటుంబం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ప్రస్తుత యజమాని మనోజ్ బదాలే అండ్ కన్సార్టియం నుండి జట్టును కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జస్థాన్ రాయల్స్‌లో టీమ్‍లో మిట్టల్ ఫ్యామిలీకి సుమారు 75 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది.

సుమారు 18 శాతం వాటాను అదర్ పూనావాలా కలిగి ఉంటారు. మరో 7 శాతం వాటా పాత పెట్టుబడిదారులైన మనోజ్ బదాలేతో సహా ప్రస్తుతం ఉన్న కొందరు ఆమోదిత పెట్టుబడిదారుల చేతిలో ఉంటుంది. 15,600 కోట్ల డీల్‌లో కేవలం ఐపీఎల్ పురుషుల జట్టు మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలోని ఇతర జట్లు కూడా ఇందులో భాగమేని స్పష్టం చేశారు. ఐపీఎల్ లోని రాజస్థాన్ రాయల్స్ , దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లోని పార్ల్ రాయల్స్ , కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోని బార్బడోస్ రాయల్స్ ఈ డీల్ లో భాగమే అని తెలిపారు. యాజమాన్య మార్పు తర్వాత రాజస్థాన్ రాయల్స్ బోర్డులో లక్ష్మీ ఎన్. మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్-భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బదాలే ఉండనున్నారు.

Published : 
  • 4 May 2026, 7:50 PM IST