నిన్న అనుష్క నేడు సమంత…!

ప్రస్తుతం టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రేజ్ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ బాగా పడిపోయిందనే చెప్పాలి.

Post Published By: dialnews
Updated : 19 June 2026, 4:31 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రేజ్ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ బాగా పడిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా, ఇటీవల అనుష్క నటించిన భారీ చిత్రం 'ఘాటీ' బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక దారుణంగా ఫ్లాప్ అవ్వడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ దెబ్బతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువైందనే భయాలు నిజమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో, స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సమంత మరియు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం మంచి హిట్ అందుకుంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. అయితే, ప్రశ్న ఏంటంటే... ప్రస్తుతం నడుస్తున్న బాక్సాఫీస్ ట్రెండ్ దృష్ట్యా, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? కమర్షియల్ సినిమాల తాకిడిలో, ఈ సినిమా థియేటర్లలో నిలబడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బిజినెస్ పరంగా ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమా ఏకంగా 30 కోట్లు రాబట్టింది. కాబట్టి, థియేటర్ల నుండి వచ్చే వసూళ్లు అదనపు లాభాలుగా మిగులుతాయి.మరి సమంత 'మా ఇంటి బంగారం' లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఉన్న ఈ నెగెటివ్ అభిప్రాయాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాలి.

Published : 
  • 19 June 2026, 4:31 PM IST