ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. 9 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఆశలు సన్నగిల్లాయి.ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కెప్టెన్సీ కారణంగా పంత్ బ్యాటింగ్‌లో కూడా రాణించలేకపోతున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ఐపీఎల్ 2025 సీజన్లో ఆల్‌టైమ్ రికార్డ్ ధర 27 కోట్లతో లక్నోలోకి వచ్చిన రిషభ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
కానీ ఐపీఎల్ 2025 సీజన్‌తో పాటు తాజా సీజన్లోనూ పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. అటు కెప్టెన్సీతో పాటు ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పంత్ 14 మ్యాచ్‌ల్లో 260 పరుగులే చేశాడు. తాజా సీజన్లో 9 మ్యాచ్‌ల్లో 204 పరుగులు మాత్రమే చేయగా.. అతని స్ట్రైక్‌రేట్ 128.30కి పడిపోయింది.పంత్ వైఫల్యంపై మాజీ క్రికెటర్లు స్పందించారు. కెప్టెన్సీ ఒత్తిడితో తన బ్యాటింగ్ కూడా మరిచిపోయినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ఒక ఆటగాడిపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు.. ఆ బాధ్యత నుంచి అతడిని తప్పించడం మంచిదనీ మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
పంత్ ప్రతిభావంతుడైన ఆటగాడు అనడంలో సందేహం లేదనీ, కెప్టెన్సీ భారం దూకుడుకు అడ్డంకిగా మారిందన్నాడు. అతడిని కేవలం బ్యాటర్‌గా ఆడించడం ద్వారా తన పాత ఫామ్‌ను అందుకునేందుకు దోహదపడుతుందన్నాడు. మరో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ ఒత్తిడి వల్ల మనం ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయి బ్యాటర్‌ను కోల్పోతున్నామని విశ్లేషించాడు. లక్నో జట్టు అతన్ని ఈ బాధ్యతల నుంచి విముక్తుడిని చేసి, స్వేచ్ఛగా ఆడటానికి అనుమతించాలని సూచించాడు. రిషభ్ పంత్ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మార్క్రమ్ కెప్టెన్సీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.