క్యాలెండర్‌లో జూన్ 4వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయబడబోయే రోజు. ఇప్పటివరకు పాన్ ఇండియా చూసింది ఒక లెక్క.. ఇకపై చూడబోయేది ఇంకో లెక్క. అదీ పెద్ది లెక్క. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సింహంలా వేట మొదలుపెడితే, రికార్డులన్నీ రాలిపోవాల్సిందే.మగధీరతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి, రంగస్థలంతో నటనలో విశ్వరూపం చూపించి, RRRతో ఆస్కార్ వేదికపై నాటు నాటు అంటూ స్టెప్పులేసిన మెగా పవర్‌స్టార్.. ఇప్పుడు 'పెద్ది'గా వస్తున్నాడు. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, టాలీవుడ్ రూపురేఖలను మార్చేసే ఒక సునామీగా దర్శనమిస్తోంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే పాత రికార్డులన్నీ కనుమరుగవ్వడం ఖాయం అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. జపాన్ నుండి అమెరికా వరకు చరణ్ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటిపోయింది. కొందరు అంటారు ఇది టాలీవుడ్ అని.. కానీ జూన్ 4 తర్వాత, బాక్సాఫీస్ వద్ద కురిసే కలెక్షన్ల వర్షం చూశాక, విశ్లేషకులు ఒకటే మాట అంటారు.. 'ఇది టాలీవుడ్ కాదు.. ఇది చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీ! అని. ఎందుకంటే, చరణ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలే మగధీరుడు.
పెద్ది ద్వారా రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారెంటీ. పెద్ది సినిమాలో చరణ్ మేకోవర్, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే టాలీవుడ్ టాప్ రికార్డులన్నీ ఈ సినిమా ముందు తలవంచాల్సిందే.మొత్తానికి 'పెద్ది' సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆక్సిజన్ లాంటిది. ఈ సినిమా సృష్టించబోయే రికార్డులు, బాక్సాఫీస్ వద్ద కురిపించబోయే కాసుల వర్షం కోసం ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. మరి ఇంతటి బాక్సాఫీస్ దాహాన్ని తీర్చే మెగా మాస్ జాతర ఇంకొన్ని రోజుల్లో మొదలుకానుంది.