మెగా తూఫాన్.. షాక్ లో ఖాన్స్ అండ్ కపూర్స్…!

మెగా ఫ్యాన్స్ కలలకు తగ్గట్టే లెంథీ డ్యూరేషన్ తో పెద్ది ట్రైలర్ పేలింది. ఖాన్లు, కపూర్లను తలదన్నేలా భారీ కండలతో రామ్ చరణ్ లుక్ షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతవరకు మల్టీ స్టారర్ మూవీలు చూశాం.. లేదంటే మల్టీ ట్యాలెంటెడ్ రోల్ లో హీరోని చూశాం

Post Published By: dialnews
Updated : 19 May 2026, 5:50 PM IST

మెగా ఫ్యాన్స్ కలలకు తగ్గట్టే లెంథీ డ్యూరేషన్ తో పెద్ది ట్రైలర్ పేలింది. ఖాన్లు, కపూర్లను తలదన్నేలా భారీ కండలతో రామ్ చరణ్ లుక్ షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతవరకు మల్టీ స్టారర్ మూవీలు చూశాం.. లేదంటే మల్టీ ట్యాలెంటెడ్ రోల్ లో హీరోని చూశాం.. ఎట్ లీస్ట్ మల్టీ రోల్స్ ఒకేసారి వేసిన స్టార్లని చూశాం..కాని ఫస్ట్ టైం మల్టీ రోల్స్ ని ఒకే పాత్రలో ఒకే హీరో చూపించటం మాత్రం ఇదేమొదటి సారి... పెద్ది ట్రైలర్ చూస్తుంటే, పాటలు, టీజర్ కంటే ఘనంగానేపేలింది. ఇది ఒకప్పటి ఆస్కార్ నామిని లగాన్ కి మాడ్రన్ వర్షన్ అని కొందరంటే, లేదు అదే హీరో ఆమీర్ తీసిన దంగల్ కి మరో వర్షన్ అని ఇంకొందరంటున్నారు. కాని ఫైనల్ గా మాత్రం రంగస్థలం చిట్టి బాబుని దంగల్ ప్లస్ లగాన్ ఇలా ఒకేసారి రెండు యుద్దాలుల చేయించిన బుజ్జిబాబు అన్న మాటే తూటాలా దూసుకెళుతోంది. ఇంతకి పెద్ది ఎవరు? ట్రైలర్ తో ఏం తేలింది? నార్త్ ఇండియా మార్కెట్ లో 400 కోట్ల రికార్డుకి పెద్ది ఎంత దూరంలో ఉన్నాడు?

పెద్ది ట్రైలర్ పేలింది.. అలా ఇలా కాదు.. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉంది. ఒకే సినిమాకి వెళితే నాలుగైదు మూవీలు చూసినట్టనిపిస్తే, అది వన్ ప్లస్ త్రీ ఆఫర్ లాంటిదే.. నిజంగా ఒకేసారి రామ్ చరణ్ నాలుగైదు సినిమాలు తీసి, ఒకే మూవీగా మెర్జ్ చేశారా అన్నట్టు పెద్ది ట్రైలర్ పేలింది. ఆల్రెడీ పాటల పేలాయి.. టీజర్లు దుమ్ముదులిపాయి.ఇక ట్రైలర్ వంతురాగానే, ఊహించిన దానికంటే బలంగానే రీసౌండ్ చేసిందిపెద్ది ప్రోమో.. ఓరకంగా రంగస్థలానికే పెద్ది టచ్ ఇచ్చారా అన్నట్టు మరోసారి చిట్టి బాబుని దర్శకుడు బుచ్చి బాబు గుర్తు చేశాడు. కాకపోతే త్రిబుల్ ఆర్ లో కంటే కూడా బలంగా కండలతో రామ్ చరణ్ లుక్ కిక్ ఇచ్చింది. హిందీ మూవీలు దంగల్, అలానే సల్మాన్ కాన్ మూవీ సుల్తాన్ లో ఖాన్లనుచూస్తే, వాళ్లని మించేలా పెద్ది ఉన్నాడనంటున్నారు.

కాసేపు క్రికెట్, ఇంకాసేపు కుస్తా, కట్ చేస్తే, ఓలంపిక్ అథ్లెట్స్ లా రన్నింగ్.. ఇలా ఇన్ని ఆటల్లో ఆరితేలిన కూలీగా పెద్ది పెద్ద సాహసమే చేశాడు. బేసిగ్గా ఆటల బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తే వెండితెర వెలిగిపోతుంది. మరీ ముఖ్యంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తే, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. అందులోనూ పీరియాడికల్ కిక్ ఇస్తే, లక్ కలిసొచ్చినట్టే.అందుకే ఇది ఆమిర్ ఖాన్ లగాన్ కి మాస్ వర్షన్ అంటున్నారు. లగాన్, దంగల్, ని రంగస్థలంలో చిట్టి బాబు చేస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు బుచ్చి బాబు. కాకపోతే తన గురువు సుకుమార్ ఎఫెక్ట్ తన మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వద్దన్నా పుష్పరాజ్ తో పోలికలు కనిపిస్తున్నాయి.నిజానికి పుష్పారాజ్ కి ముందే రంగస్థలం వచ్చింది. చిట్టి బాబు మాస్ మంత్ర జపిస్తే, బాక్సాఫీస్ షేక్ అయ్యింది. కాబట్టి పుష్పరాజ్ తోపోల్చటం కరెక్ట్ కాకున్నా, హీర హీరోయిన్ కనెక్షన్స్, యాస, హీరో లుక్ ఇవన్నీ చూస్తుంటే, రంగస్థలం చిట్టిబాబు పుష్పారాజ్ గా మారి, లగాన్, దంగల్ సినిమాలు చూపించబోతున్నాడా అనంటున్నారు.. అదే నిజమైతే పాన్ ఇండియా లెవల్లో పెద్దికి పెద్దగ కలిసొచ్చినట్టే.

Published : 
  • 19 May 2026, 5:50 PM IST