సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో... అందరూ అన్ని మాట్లాడుతున్నారు గాని... సాయి కృష్ణ శవం ఏమైంది అన్నది ఇప్పటి వరకు తేల్చలేదు. పోలీసులు సాయికృష్ణని హత్య చేశారు. కానీ శవాన్ని ఏం చేశారు? అది మాత్రం ఎక్కడ .....రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పలేదు. అది తేలనంతవరకు ఈ కేసులో దోషులు ఎవరో తేల్చలేము. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో హత్య గురించి మాత్రమే రాశారు తప్ప... సీఐ నాగరాజు అండ్ గ్యాంగ్ శవాన్ని ఏం చేశారు...? తగలబెట్టారా? కృష్ణా నదిలో పడేశారా? బూడిద చేశారా? ఎక్కడైనా కప్పెట్టారా? అసలు శవాన్ని ఏం చేశారు? అది ఎక్కడుంది? హత్య జరిగిన తర్వాత శవాన్ని మాయం చేయడం వరకు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. మీడియా కానీ? పోలీసులు కానీ? ప్రతిపక్షం కానీ.... ఈ పాయింట్ మీద ప్రశ్నించడం లేదు.
సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలకం అతని శవం మాత్రమే. శవం దొరకనంతవరకు..... మృతదేహాన్ని ఏం చేశారో తేలనంతవరకూ ఈ కేసులో పురోగతి ఉండదు. రిమాండ్ రిపోర్ట్ లో రాసిన..... చార్జీ షీట్లో స్పష్టంగా పేర్కొన్న... కోర్టులో కేసు నిలబడదు. శవం ఏమైంది? దానిని ఏం చేశారు...? కనీసం అస్థిక లైన ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానాలు ....ఆధారాలు కచ్చితంగా దొరకాలి. అప్పుడు మాత్రమే ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుంది. ఇది సీఐ నాగరాజు కి, అతని పైనున్న అధికారులకి అందరికీ స్పష్టంగా తెలుసు. పోలీస్ మార్క్ ఎక్స్పర్టిజం అంటే అదే. ఒక కేసులో ఎవడినైనా ఎలా ఇరికించాలి.... లేదు ఒక కేసులో దోషుల్ని ఎలా తప్పించాలి అనే విషయంలో పోలీసు ఉన్నత అధికారులు నిష్ణాతులు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రాజకీయ వివాదం అవుతుందని పోలీసులకు ముందే తెలుసు.
కనుకే కేసులో ఆధారాలు లేకుండాశవాన్ని మాయం చేశారు. నాగరాజు తో పాటు కస్టోడియల్ డెత్ కు మరో ముగ్గురు కానిస్టేబుల్స్ పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్స్ ని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సిఐ నాగరాజుకు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు సాయి కృష్ణ శవాన్ని మాయం చేయడంలో సహకరించినట్లు తెలిసింది. వారిలో ఒకరు సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్. ఇతగాడిని ప్రశ్నిస్తే ఆధారాలు దొరకవచని పోలీసులు భావిస్తున్నారట. సీఐ నాగరాజు చేత నిజం చెప్పించ లేకపోయిన పోలీసులు.... అతని స్నేహితుడు సురేష్ నుంచి ఎలా చెప్పిస్తారో మరి. ?ఆశ్చర్యంగా ఉంది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిసి ఫుటేజ్ అత్యంత కీలకం. కృష్ణలంక పిఎస్ లో మే ఒకటి నుంచి జూన్ 1 వరకు సిసి ఫుటేజ్ ని సీఐ నాగరాజు అండ్ గ్యాంగ్ డిలీట్ చేసేసారు. ఆ సీసీ ఫుటేజ్ రికవరీ చేయడం అంత ఈజీ కాదు. అది దొరికితే గానీ శవం ఎటెల్లిందో చెప్పలేము.
రిమాండ్ రిపోర్టులో సాయి కృష్ణను కొట్టడం వల్ల అతను చనిపోయినట్టు రాశారు. రిమాండ్ రిపోర్ట్ అక్కడితో ఆగిపోయింది. కానీ హత్య జరిగిన తర్వాత శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు,? ఏం చేశారు? అన్నది మాత్రం రాయలేదు. సీఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదని, అంతకుమించి ఏమీ చెప్పడం లేదని.... అతని నుంచి స్పష్టమైన సమాధానాలు లేవని మాత్రమే పోలీసులు చెప్తున్నారు. నాగరాజు నుంచి స్పష్టమైన సమాధానాలు లేవు అంటే ఈ కేసు నీరుగారి పోతుందని అర్థం. జరిగిన విషయం అందరికీ తెలిసిందే. శవాన్ని ఏం చేశారు అన్నదే ఈ కేసులో తేలాల్సింది.సిసి ఫుటేజ్ ఫుటేజ్ ఆధారాలు లేవు, స్మశానంలో రికార్డులు లేవు,సాయి కృష్ణ శవం ఏమైందో తెలియదు, అన్ని తెలిసిన సీఐ నాగరాజు ఏమీ చెప్పడు... బహుశా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా మాకు న్యాయం జరిగిపోయింది అని చెప్పేశారు కనుక వాళ్లు కూడా గట్టిగా డిమాండ్ చేయకపోవచ్చు. మీడియా కి కొత్త ఇష్యూ ఏదైనా దొరికితే క్షణాల్లో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుని అటక ఎక్కించేస్తుంది. ఈ ఓవరాల్ క్రైమ్ స్టోరీ లో ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం దొరకాలి. సాయి కృష్ణ శవాన్ని ఏం చేశారు? అది ఎక్కడ ఉంది?ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది సీఐ నాగరాజు .... లేదా సాయి కృష్ణ శవం మాత్రమే. అది తేలనంతవరకు జరిగేదంతా డ్రామానే.