పదిహేనేళ్ల బాలుడని.. నూనూగు మీసాలు కూడా రాని బుడ్డోడని.. ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్య వంశీ గురించి చెప్పుకుంటున్నాం.. కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. అతడు చేసే పనులు మామూలుగా లేవు. ఏకంగా కోట్లకు ఎసరు పెట్టాడు. అంతేకాదు రూపాయి తక్కువైనా చేసేది లేదని.. ఇది వ్యాపారం అని చెబుతున్నాడు.వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో ఈ సంవత్సరం గట్టిగానే వెనుకేసుకున్నాడు. రఫ్ గా ఒక ఆరు కోట్లు ఆర్జించాడు. ప్రస్తుతం సూర్య వంశీ కెరియర్ పీక్స్ లో ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు అదే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు మాత్రమే అభిమానులు వచ్చారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేసి.. సూర్య వంశీ పేరుతో ప్లకార్డులను అభిమానులు పట్టుకొచ్చారు. మైదానంలో ప్రదర్శన చేశారు.సూర్య వంశీ కి తొలి మ్యాచ్ లో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. రెండో మ్యాచ్లో అవకాశం కూడా ఛాన్స్ రాలేదు. తర్వాత ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం అతను అరంగేట్రం చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీకి సంబంధించిన బ్యాట్ వాడుతున్నాడు. అయితే అతడు త్వరలోనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడితో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ సూర్య వంశీకి 6 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు సూర్య వంశీ 12 కోట్లు అయితేనే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓకే చెబుతానని చెప్పినట్లు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. మరోవైపు సూర్య వంశీ.. ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సూర్య వంశీ 15 సంవత్సరాల వయసులోనే కోట్లు వెనకేసుకుంటున్నాడు. తన తోటి పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే.. అతడేమో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. బుడ్డోడు అనుకుంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకే చుక్కలు చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.