Special story: రన్నింగ్‌ ట్రైన్‌లో ఫస్ట్‌ నైట్‌, సెటప్‌ ట్రైన్‌ని కూడా వదలరా ?

ట్రెండ్ మారుతోంది భయ్యా. ఒకప్పుడు హనీమూన్ అనగానే గోవా, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, రూటూ మారింది.

Post Published By: dialnews
Updated : 9 July 2026, 4:59 PM IST

ట్రెండ్ మారుతోంది భయ్యా. ఒకప్పుడు హనీమూన్ అనగానే గోవా, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, రూటూ మారింది. ఫ్లైట్‌లెక్కే ఓపిక లేదనుకున్నారో లేక బస్సెక్కే తీరిక లేదనుకున్నారో.. ఏకంగా ఓ కొత్త జంట కదిలే రైలునే హనీమూన్ సూట్‌లా మార్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన ఒక జంట కోసం ఫస్ట్ ఏసీ కూపేను ఒక రేంజ్‌లో అలంకరించారు. ఎర్రటి కర్టెన్లు, మనసు దోచేలా పసుపు రంగు ఫెయిరీ లైట్లు, దానికి తోడు హార్ట్ షేప్‌లో ఉండే బెలూన్లు.. ఇక మంచం నిండా పండ్లు, గులాబీ రేకులు చల్లేసి ఏకంగా రైలు బోగీని ఫైవ్ స్టార్ హోటల్ హనీమూన్ సూట్‌లా మార్చేశారు. ఈ సెటప్ అంతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలితే.. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారి నెట్టింట రెండు వర్గాల మధ్య పెద్ద రచ్చకు దారి తీసింది.

కొంతమంది రొమాంటిక్ బాబులు "సూపర్ ఐడియా గురూ.. ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కూపే తలుపులేసుకున్నారు కదా, తప్పేముంది? ఈ ప్రయాణం వాళ్లకు లైఫ్‌లాంగ్ ఒక మంచి మెమరీలా గుర్తుండిపోతుంది" అంటూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకొందరు మాత్రం ఫుల్ సీరియస్ అవుతున్నారు. "పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను పర్సనల్ బెడ్‌రూమ్‌లా వాడేస్తారా? ఆ ఫెయిరీ లైట్లు, ఎక్స్‌ట్రా క్లాత్స్ పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా జరిగితే ఎవరిది బాధ్యత? ఎంజాయ్ చేయడం అయిపోయాక ఆ బెలూన్లు, పూల చెత్త అంతా ఎవరు క్లీన్ చేస్తారు?" అని ఫైర్ అవుతున్నారు.

సిద్దార్థ్ అనే ఒక నెటిజన్ అయితే, "ఫస్ట్ ఏసీలో అయినా ప్రశాంతంగా ప్రయాణించొచ్చు అనుకున్నా.. ఈ 2026లో ఈ సుహాగ్‌రాత్ టూరిజం చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు" అంటూ తలపట్టుకున్నాడు. ప్రస్తుతానికి అయితే ఇండియన్ రైల్వేస్ నుంచి ఈ వీడియోపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వింత సంఘటన ఏ రైలులో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు జరిగిందనేది కూడా ఇంకా సస్పెన్సే. కానీ ఈ వీడియో చూశాక, జనాలు "రేపటి రోజున ఎవరైనా ఏకంగా ఏసీ బోగీలోనే కళ్యాణ మండపం సెటప్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా.. ఐడియా వెరైటీగా ఉన్నా, రైల్వే నిబంధనలు, తోటి ప్రయాణికుల భద్రతను కూడా కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిదని పెద్దలు సెలవిస్తున్నారు. సో.. మీరెప్పుడైనా ఫస్ట్ ఏసీలో వెళ్లేటప్పుడు, పక్క కూపే నుంచి ఏ గులాబీ పూల వాసనో వస్తే. పొరపాటున కూడా డోర్‌ తీయకండి.

Published : 
  • 9 July 2026, 4:59 PM IST