హిందూ మహాసముద్రంలో ఇన్నాళ్లూ చైనా సాగించిన అక్రమ ఆధిపత్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేలా భారత్ ఒక ఊరమాస్ వ్యూహాన్ని అమలు చేసింది. చైనా చుట్టూ 'రక్షణ వలయం' బిగిస్తూ, ఆ దేశ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త డిజిటల్ మరియు డిఫెన్స్ విప్లవానికి తెరతీసింది టీమిండియా. అవును, ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనాకు కోలుకోలేని దెబ్బ కొడుతూ వ్యూహాత్మక 'సబాంగ్ పోర్ట్' అభివృద్ధి కోసం ఇండోనేషియాతో చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. అసలు ఈ సబాంగ్ పోర్ట్ కథ ఏంటి? దీనివల్ల చైనా ఎందుకు వణికిపోతోంది?
ఇన్నాళ్లూ చైనా.. భారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టేందుకు 'స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్' అనే వ్యూహంతో మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్‌లలో సైనిక, వాణిజ్య పోర్టులను నిర్మించింది. దీని ద్వారా భారత నౌకాదళాన్ని కట్టడి చేయాలనేది బీజింగ్ కుట్ర. కానీ, ఇప్పుడు భారత్ తిప్పికొట్టే సమయం వచ్చింది. ఇండోనేషియాలోని అత్యంత కీలకమైన వేహ్ ఐలాండ్ లో ఉన్న 'సబాంగ్ పోర్ట్'ను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు భారత్-ఇండోనేషియా డీల్ కుదుర్చుకున్నాయి. ఈ ఒక్క పోర్టుతో చైనా కట్టిన ముత్యాల హారాన్ని భారత్ ముక్కలు ముక్కలు చేయబోతోంది.
అసలు ఈ సబాంగ్ పోర్ట్ ఎందుకు అంత పవర్‌ఫుల్? గ్లోబల్ మ్యాప్ తీసి చూస్తే.. ఈ సబాంగ్ పోర్ట్ సరిగ్గా 'మలక్కా జలసంధి' ద్వారం వద్ద ఉంటుంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో దాదాపు 23 శాతం వాటా ఈ మలక్కా జలసంధి గుండానే సాగుతుంది. ముఖ్యంగా చైనాకు అవసరమైన 80 శాతం ముడి చమురు ఈ రూట్ నుంచే వెళ్లాలి. ఇప్పుడు ఈ సబాంగ్ పోర్ట్ మన అండమాన్ నికోబార్ దీవులలో భారత్ నిర్మిస్తున్న గ్రేట్ నికోబార్ ట్రాన్స్-షిప్‌మెంట్ పోర్టుకు కేవలం 160 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
అంటే, చైనాకు ఊపిరి పట్టు లాంటి ఈ సముద్ర మార్గంపై ఇక నుంచి భారత్-ఇండోనేషియా.. జమ్మూ-కాశ్మీర్ లాగా పూర్తి నిఘా పెట్టబోతున్నాయి. ఈ డీప్-వాటర్ పోర్ట్‌లో మన యుద్ధ నౌకలతో పాటు సబ్‌మెరైన్లను కూడా మోహరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇండోనేషియాలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన కేవలం ఒక సాధారణ పర్యటన కాదు, ఇదొక వ్యూహాత్మక దౌత్య యుద్ధం. ఇండోనేషియా పార్లమెంట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు కావాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ పర్యటనలో భారత్-ఇండోనేషియా కలిసి రక్షణ, వాణిజ్యం, కనెక్టివిటీ రంగాల్లో ఏకంగా 20 మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ లపై సంతకాలు చేశాయి. సముద్ర ఆధారిత పర్యాటకం, ఓడల నిర్మాణం, షిప్-రిపేరింగ్ పరిశ్రమలతో పాటు ఇరు దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
ఈ చారిత్రక ఒప్పందంపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ.. "భారత్, ఇండోనేషియాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వాములు. సబాంగ్ పోర్ట్, గ్రేటర్ నికోబార్ పోర్టుల కలయికతో ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది" అని స్పష్టం చేశారు. ఈ కూటమితో అటు దక్షిణ చైనా సముద్రంలో, ఇటు హిందూ మహాసముద్రంలో చైనా ఆటలు ఇక సాగవు. ఒకవేళ చైనా తోక జాడిస్తే.. మలక్కా జలసంధి వద్ద చైనా చమురు నౌకల గొంతు నొక్కేసే పవర్ ఇప్పుడు భారత్ సొంతమైంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధం ఉన్న భారత్-ఇండోనేషియాలు.. ఇప్పుడు చైనా అహంకారానికి సముద్రంలోనే సమాధి కట్టేందుకు సిద్ధమయ్యాయి.