ఇవి ఐపీఎల్ పిచ్ లు కాదు.. భారత బ్యాటర్లపై ఆర్చర్ సెటైర్లు..!

ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆర్చర్.

Post Published By: dialnews
Updated : 9 July 2026, 6:55 PM IST

ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆర్చర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్ పిచ్‌లతో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. భారత్‌లో చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ల వల్ల బౌలర్లకు తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదని, ఇంగ్లండ్‌లో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇదే భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని పరోక్షంగా వెల్లడించాడు.

ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుందనీ, ఐపీఎల్‌లో మాత్రం కొన్ని సందర్భాల్లో 200 పరుగులు కూడా సురక్షితం కాదన్నాడు. కానీ ఇంగ్లీష్ పిచ్ లపై బౌలర్లకు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయనీ, పిచ్ నుంచి బౌన్స్ లభిస్తుందన్నాడు. రాంగ్ డెలివరీని కూడా కొన్నిసార్లు ఫీల్డర్లు రక్షించగలరన్న ఆర్చర్ భారత్‌లో బౌలర్లు ఎలాంటి చిన్న తప్పు చేసినా వెంటనే భారీ షాట్ల రూపంలో శిక్ష పడుతుందన్నాు. ఇంగ్లండ్ పిచ్‌లపై 200 పరుగులు సాధిస్తే విజయం దాదాపు ఖాయమని వ్యాఖ్యానించాడు. తమ బౌలర్లు కొత్త బంతితో దాడి చేయగలిగారీ, సరైన లైన్, లెంగ్త్ దొరికితే ఈ వికెట్‌పై వికెట్లు రావడం సహజమన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన సహచరుడైన 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో సాగుతున్న పోరుపై కూడా ఆర్చర్ స్పందించాడు. మాంచెస్టర్ మ్యాచ్‌లో తొలి బంతికే తనను సిక్సర్ కొట్టిన వైభవ్‌ను, ఈ మ్యాచ్‌లో ఆర్చర్ 13 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య పోటీ సమంగా ఉందని ఆర్చర్ సరదాగా అన్నాడు.ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్ జోష్ టంగ్ 38 పరుగులకు 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ ఇద్దరూ గంటకు 144 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి, పిచ్ నుంచి లభించిన అదనపు బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయిన భారత జట్టు.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ 0-2తో వెనుకబడింది.

Published : 
  • 9 July 2026, 6:55 PM IST