Top Story: భయంతో పారిపోయిన ట్రంప్, ఇరాన్ దెబ్బకు పాత ఫ్లైట్ లో ఎస్కేప్ అసలేం జరిగింది..?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు.. పైగా ఇరాన్ శత్రువుల గుండెల్లో నిద్రపోయే డోనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా తన విమానాన్ని మార్చేశారు

Post Published By: dialnews
Updated : 10 July 2026, 3:30 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు.. పైగా ఇరాన్ శత్రువుల గుండెల్లో నిద్రపోయే డోనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా తన విమానాన్ని మార్చేశారు. ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానాన్ని అర్ధాంతరంగా పక్కన పెట్టేసి.. పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించారు! అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన ఒకే ఒక్క వార్నింగ్‌తో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారా? "ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేనే నెంబర్ వన్" అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న అసలు భయం ఏంటి..? మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సృష్టిస్తున్న రణరంగం ఏంటి?

విషయంలోకి వెళ్తే.. అంకారాలో జరిగిన నాటో సదస్సు ముగించుకుని ట్రంప్ స్వదేశానికి బయలుదేరారు. అంతా సజావుగానే సాగుతోంది అనుకున్న సమయంలో.. బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్ ఎయిర్‌బేస్ వద్ద ట్రంప్ విమానం ఆగింది. అక్కడి నుంచి అమెరికా వెళ్లడానికి ట్రంప్ సరికొత్త ఖతార్ జెట్‌ను ఎక్కాల్సింది. కానీ, చివరి నిమిషంలో సీక్రెట్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, కొత్త విమానంలో ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని తేల్చి చెప్పారు. దాంతో, ట్రంప్ వెంటనే తన పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలోకి మారిపోయారు.

ఈ విమానం మార్పుపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "నాకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది.. ఇరాన్ కిల్ లిస్ట్‌లో నేనే నెంబర్ వన్" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు! అయితే, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికే తాను పాత విమానం ఎక్కానని ట్రంప్ పైకి కవర్ చేసినప్పటికీ, అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు రక్షణ నిపుణులు. ఖతార్ ఇచ్చిన కొత్త విమానం ఎంత విలాసవంతంగా ఉన్నప్పటికీ.. అమెరికా ప్రెసిడెంట్ విమానానికి ఉండాల్సిన క్షిపణి నిరోధక వ్యవస్థలు, అత్యున్నత రక్షణ గేడ్జెట్లు ఇంకా అందులో పూర్తి స్థాయిలో అమర్చలేదు. శత్రువులు దాడి చేస్తే తట్టుకునే సామర్థ్యం పాత ఎయిర్ ఫోర్స్ వన్ కే ఉండటంతోనే అధికారులు ఈ రిస్క్ తీసుకోలేదు.

ట్రంప్ ప్రయాణించిన ఆ పాత విమానంలో భద్రత ఏ రేంజ్‌లో ఉందంటే.. ప్రయాణం ముగిసేవరకు కిటికీల తెరలు అస్సలు తీయకూడదని రిపోర్టర్లను గట్టిగా ఆదేశించారు. ఇరాన్‌ను ఉద్దేశించి "ఇక్కడ కొందరు నీచులు ఉన్నారు, మనల్ని కనిపెడుతున్నారు" అని ట్రంప్ అనడం ఆందోళన రేకెత్తించింది. ఎందుకంటే, హార్ముజ్ జలసంధిలో కమర్షియల్ షిప్పులపై ఇరాన్ దాడి చేయడంతో.. అమెరికా రీసెంట్‌గా ఇరాన్ స్థావరాలపై విమానాలతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా మిలిటరీ క్యాంపులపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం పీక్స్‌కు చేరడంతోనే ట్రంప్ భద్రతపై ఇంతలా హైడ్రామా నడిచింది.

వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ ఛెంగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. శత్రువులను తప్పుదోవ పట్టించడానికి కూడా ఇలాంటి వ్యూహాలు వాడతామని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా.. ఇరాన్ ముప్పుతో అమెరికా ప్రెసిడెంట్ ఇలా విమానాలు మార్చాల్సి రావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో ఎలాంటి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయో చూడాలి.

Published : 
  • 10 July 2026, 3:30 PM IST