Top story: భారతీయ ఐటీ ఉద్యోగులకు షాక్? అమెరికాలో మొదలైన H-1B వీసా దర్యాప్తు.. కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలకు అమెరికా నోటీసులు..!

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని కలలుగనే ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్.. హెచ్-1బీ వర్క్ వీసాల దుర్వినియోగంపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Post Published By: dialnews
Updated : 11 July 2026, 5:15 PM IST

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని కలలుగనే ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్.. హెచ్-1బీ వర్క్ వీసాల దుర్వినియోగంపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు."అమెరికా ఉద్యోగాలు అమెరికన్ల కోసమే, విదేశీ మోసగాళ్ల కోసం కాదు" అంటూ ఆయన ఒక సంచలన హెచ్చరిక జారీ చేశారు. హెచ్-1బీ వీసా వ్యవస్థను మేనేజ్ చేస్తూ.. అమెరికా చట్టాలను పక్కదారి పట్టిస్తున్న కంపెనీలను, వ్యక్తులను ఏరిపారేయడానికి ట్రంప్ ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. అసలు జేడీ వెన్స్ ఏమన్నారు? ఈ దర్యాప్తులో ఏ ఏ పెద్ద కంపెనీల పేర్లు బయటపడ్డాయి? దీనివల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం పడబోతోంది?

మిల్వాకీలోని ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌లో జరిగిన ఒక సభలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను వాస్తవానికి ఒక అద్భుతమైన టెక్నాలజీ నిపుణుడు, గొప్ప శాస్త్రవేత్త లేదా ప్రతిభావంతుడైన డాక్టర్ చట్టబద్ధంగా అమెరికాలో పనిచేయడానికి డిజైన్ చేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం పూర్తిగా పక్కదారి పట్టిందని ఆయన ఆరోపించారు. పెద్ద పెద్ద కార్పొరేషన్లు మరియు విదేశాల్లోని కొందరు బ్రోకర్లు ఈ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ.. అమెరికన్ కార్మికుల వేతనాలను తగ్గించేస్తున్నారని వెన్స్ మండిపడ్డారు. అందుకే ట్రంప్ ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరిస్తోందని, ఈ వీసా ప్రోగ్రామ్‌ను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేస్తే అమెరికాలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

వెన్స్ ప్రకటనకు తగ్గట్టుగానే అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. హెచ్-1బీ మరియు పెర్మ్ వీసా కేటగిరీలలో జరుగుతున్న అక్రమాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ పలు కంపెనీలకు అధికారికంగా సబ్‌పోనాల్ జారీ చేయడం ప్రారంభించింది. లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో మాట్లాడుతూ.. ఈ అడ్మినిస్ట్రేషన్‌లో విదేశీ కార్మిక మోసాలకు వ్యతిరేకంగా మునుపెన్నడూ లేనంత అత్యంత దూకుడుగా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. కొంతమంది విజిల్‌బ్లోయర్స్.. అంటే.. సమాచారం ఇచ్చిన వాళ్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం తాము ప్రతి లీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఈ దర్యాప్తులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. ఐటీ దిగ్గజం అయిన కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీల పేర్లు కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. లేబర్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. కొందరు యజమానులు మరియు లేబర్ బ్రోకర్లు నకిలీ అప్లికేషన్లను సమర్పిస్తూ, విదేశీ కార్మికులను తక్కువ జీతాలతో దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. నిజమైన నైపుణ్యం ఉన్న కొరతను తీర్చడానికి ఉపయోగించాల్సిన ఈ వ్యవస్థను, కొందరు వ్యక్తులు తమ సొంత లాభాల కోసం వాడుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో హెచ్-1బీ వీసా ప్రాసెస్‌ను మరింత కఠినతరం చేసేలా కనిపిస్తున్నాయి. జెన్యూన్ గా టాలెంట్ ఉండి యూఎస్ వెళ్లాలనుకునే వారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా, కన్సల్టెన్సీలు మరియు ఫేక్ డాక్యుమెంట్లతో నెట్టుకొచ్చే వారికి మాత్రం అమెరికా తలుపులు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉంది.

Published : 
  • 11 July 2026, 5:15 PM IST