సూపర్‌స్టార్ మహేష్ బాబు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ విషయానికి వస్తే పక్కా ఫ్యామిలీ మేన్‌గా మారిపోతుంటారు. తాజాగా తన ముద్దుల కుమార్తె సితార 14వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.ఒక రెస్టారెంట్లో జరుగుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు తన కుమార్తె సితారను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ ఈ స్పెషల్ పిక్‌లో కనిపించారు.
ఈ ఫోటోను షేర్ చేస్తూ.. "నువ్వు ఎంత ఎదిగినా ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే.. హ్యాపీ 14 సితార! ఈ ఏడాది నీకు ఎంతో అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.. లవ్ యూ ఆల్వేస్" అంటూ మహేష్ బాబు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ అందమైన బంధాన్ని చూసి ఘట్టమనేని అభిమానులు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకు వేలల్లో లైకులు, కామెంట్లు రావడంతో ప్రస్తుతం ఈ పిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.