ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు.... వాట్ టు డు ?వాట్ నాట్ టు డు? ఉండమంటారా.... పొమ్మంటారా.? ఈ ప్రశ్న ఎవరిదో తెలుసా ఇండియన్ హిట్ మాన్ రోహిత్ శర్మ ది.ఎవడెవడో ఏదో రాస్తూ ఉంటాడు. ఇంకెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో ఏ మార్పు తీసుకురావు. నాకు బుర్ర ఉంది. అంతకుమించి మెచ్యూరిటీ ఉంది. ఇద్దరు పిల్లల తండ్రిని. నేనేం చేయాలో నాకు తెలుసు... నేను ఆలోచించుకోగలను. ఇలా సమాధానం చెప్పి గ్రౌండ్ లోకి వెళ్లి ఇంగ్లాండ్ బౌలర్ కి రేవు పెట్టేసాడు. రిటైర్మెంట్ వార్తల ఒత్తిడిలో తన ఆట తీరుతోనే సెలెక్టర్లకు విమర్శలకు సమాధానం ఇచ్చాడు. తొడ కండరాలు పట్టేసిన హిట్ మాన్ గ్రీస్ వదలకుండా పోరాడాడు. ఫీల్డింగ్ లోను చిరుతపుల్ల దూకాడు. ఇప్పుడు చెప్పండి నేను ఉండాలో పోవాలా అని ప్రశ్నిస్తున్నాడు?
39 ఏళ్ల రోహిత్ పనైపోయిందన్నారు.. లార్డ్స్ వన్డే తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడన్నారు. 2027 వరల్డ్ కప్ టీమ్ ప్లాన్స్‌లో ప్లేస్ లేదన్నారు.. కానీ.. చరిత్ర సృష్టించాలన్నా.. హిస్టరీ తిరగరాయాలన్నా తనకే సొంతం అని నిరూపించాడు హిట్‌మ్యాన్ రోహిత్ . క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్‌లో వన్డేల్లో సెంచరీతో చెలరేగిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. మాస్ బ్యాటింగ్‌కు రికార్డుల మోత మోగిపోతే.. ఎవడ్రా రోహిత్ పని అయిపోయిందన్నది అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఫామ్ కోల్పోయాడు.. వయసు సహకరించట్లేదు.. వరల్డ్ కప్‌కు అవసరం లేదు.. అసలు వరల్డ్ కప్ ప్లాన్స్లోనే ప్లేస్ లేదన్నారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో పెద్దగా పరుగులు సాధించలేదు. దాంతో మూడోదే లాస్ట్.. ఆ మ్యాచ్ కాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్నారు.
ఎవరెన్ని మాట్లాడినా నోరు మెదపలేదు. కుంగిపోలేదు. ఎంతమంది విమర్శలు చేశారో.. అందరికీ ఒకేసారి ఇచ్చిపడేశాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. లార్డ్స్‌లో ఏ ఒక్క ఇండియన్ బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును సాధించి చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ అంటే రికార్డులు సృష్టించడం.. రిటైర్మెంట్ ప్రకటించడం కాదని క్లియర్‌కట్‌గా చెప్పేశాడు.అపోనెంట్ ఎవరైతే ఏంటి.. దుమ్ము దులపడమే తెలుసు అన్నట్లుగా ఇంగ్లండ్ గడ్డను తన అడ్డాగా మార్చేసుకున్నాడు రోహిత్ శర్మ. డూ ఆర్ డై మ్యాచ్‌లో ఏకంగా 138 పరుగులు చేసి.. నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే ఫార్మాట్లో ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ కొట్టిన భారత తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 39ఏళ్ల వయసులో కుర్రాళ్లకు సాధ్యం కాని ఫీట్ సాధించాడు రోహిత్. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో 84 బంతుల్లోనే రోహిత్ 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. మొత్తం 110 బంతుల్లో 138 పరుగులు చేసాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 17 ఫోర్లు.. ఐదు సిక్సులున్నాయి.
ఈ ఒక్క నాక్ చాలు.. రోహిత్ శర్మ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో చెప్పడానికి. పనైపోయిందంటూ వినిపించిన ఒక్కో విమర్శను బ్యాట్‌తో స్టేడియం బయటకు ఇసిరికొట్టాడు. 2027 వరల్డ్ కప్ ఆడాలనే కల నెరవేరదనే మాటలను కూడా మూటగట్టి బౌండరీ లైన్ దాటించేశాడు. ఎవరైనా సెంచరీ ముందు కాస్త గ్యాప్ తీసుకుంటారు. కానీ.. చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా నాకే సొంతం అన్నట్లుగా ఆడాడు. సిక్స్‌తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో రికార్డుల వేటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్.. కెరీర్లో 34వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీ మార్క్ అందుకోగానే రోహిత్ కాస్త అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
విదేశీ గడ్డపై ఒకే దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ.. ఇంగ్లీష్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో రోహిత్‌కు ఇది ఎనిమిదవ వన్డే సెంచరీ. ప్రతీ షాట్లో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. ఏజ్ జస్ట్ నంబరే బాస్.. 2027 వరల్డ్ కప్ కొట్టేదాకా రిటైరయ్యేదే లే అని రికార్డులు బద్ధలు కొట్టి మరీ చెప్పేశాడీ వెటరన్ ప్లేయర్. స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిందంటే.. మనోడి బాదుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇంగ్లాండ్ పై సింగిల్ హ్యాండ్ సెంచరీ తో బోర్డుకి సెలక్షన్ కమిటీ కి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు రోహిత్. నేను లేకుండా 20 27 వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం అని చెప్పకనే చెప్పేసాడు.