Top story: అమెరికా గుండెల్లో వణుకు.. ఇరాన్‌కు రష్యా శాటిలైట్ పవర్.. తెరవెనుక అసలు గేమ్ ఇదే!

మిడిల్ ఈస్ట్‌లో సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇన్నాళ్లూ గల్ఫ్ రీజియన్‌లో ఏకఛత్రాధిపత్యం చలాయించిన అమెరికాకు.. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు

Post Published By: dialnews
Updated : 27 July 2026, 3:26 PM IST

మిడిల్ ఈస్ట్‌లో సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇన్నాళ్లూ గల్ఫ్ రీజియన్‌లో ఏకఛత్రాధిపత్యం చలాయించిన అమెరికాకు.. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అమెరికా మిలిటరీ స్థావరాలు, గల్ఫ్ దేశాల రహస్యాలను రష్యా తన హైటెక్ శాటిలైట్ల ద్వారా సేకరించి.. నేరుగా ఇరాన్‌కు చేరవేస్తోందని జెలెన్స్కీ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అసలు ఇరాన్ రక్షణ వ్యూహం ముందు అమెరికా ఎందుకు చేతులెత్తేస్తోంది? రష్యా-ఇరాన్ ల ఈ తిరుగులేని కూటమి వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ ఎలా గల్ఫ్ రీజియన్‌లో సూపర్ పవర్‌గా అవతరిస్తోంది?

అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏం చెప్తున్నారంటే.. జూలై ప్రారంభం నుంచి రష్యాకు చెందిన నిఘా ఉపగ్రహాలు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా రక్షణ స్థావరాలపై నిరంతరం నిఘా పెడుతున్నాయట. జూలై 19, 20 తేదీల్లోనే బహ్రెయిన్‌లోని రెండు ప్రధాన ఎయిర్ బేస్‌లు, జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా మిలిటరీ స్థావరాల పూర్తి సమాచారాన్ని రష్యా సేకరించిందని జెలెన్స్కీ వాపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అమెరికా తన అగ్రరాజ్యం అనే అహంకారంతో మిడిల్ ఈస్ట్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసింది. కానీ ఇరాన్ తన పదునైన వ్యూహాలతో, రష్యా వంటి గ్లోబల్ పవర్‌ హౌస్ సహాయంతో అమెరికా డిఫెన్స్ సిస్టమ్‌ను పూర్తిగా డీకోడ్ చేసేసింది. రష్యా ఇస్తున్న ఖచ్చితమైన విజువల్స్ ఆధారంగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటోంది.

ఈ పరిణామాలు అమెరికాకు ఎంతటి నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. చైనా, రష్యాలు ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించకూడదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించాల్సి వచ్చింది. కానీ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎవరి బెదిరింపులకూ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా తన రక్షణ కోసం గల్ఫ్ దేశాలలో ఏర్పాటు చేసిన బేస్‌ల చుట్టూ ఇరాన్ ఇప్పుడు వ్యూహాత్మక పట్టు సాధించింది. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌పై కన్ను వేయాలని చూస్తే.. రష్యా శాటిలైట్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇరాన్ క్షణాల వ్యవధిలో అమెరికా బేస్‌లను టార్గెట్ చేయగల సామర్థ్యాన్ని సాధించిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా ఇన్నాళ్లూ ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఒంటరిని చేయాలని చూసింది. కానీ ఇరాన్ ఆ ఒత్తిళ్లను తట్టుకుని, స్వదేశీ సాంకేతికతతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకుంది. ఇప్పుడు దానికి రష్యా శాటిలైట్ డేటా తోడవ్వడంతో ఇరాన్ సైనిక శక్తి అజేయంగా మారింది. జెలెన్స్కీ చెప్తున్న దాని ప్రకారం.. ఇరాన్ దాడి చేయబోయే ముందే అమెరికా బేస్‌ల కదలికలను రష్యా గమనిస్తుంది, దాడి జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగిందో కూడా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఇరాన్‌కు చేరవేస్తుంది. అంటే అమెరికా వేసే ప్రతి అడుగు ఇరాన్‌కు ముందే తెలిసిపోతుందన్నమాట! ఇది ఇరాన్ దౌత్య, సైనిక విజయానికి నిదర్శనం కాక మరేంటి?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టి.. ఇరాన్, రష్యాలపై మరింత ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. రష్యా కేవలం ఇరాన్‌కే కాకుండా నార్త్ కొరియా నుంచి కూడా 30,000 మంది సైనికులను రప్పించుకుంటోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండి కొట్టడంలో ఇరాన్ మరియు రష్యాల కూటమి నూటికి నూరు పాళ్లు విజయం సాధించింది. గల్ఫ్ రీజియన్‌లో ఇకపై అమెరికా ఆటలు సాగవనే సంకేతాన్ని ఇరాన్ బలంగా పంపించింది.

Published : 
  • 27 July 2026, 3:26 PM IST