సంక్రాంతి బరిలో నాగ్..!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. దానికి ప్రధాన కారణం.. ఆయన చిన్న కుమారుడు అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే ఒక తండ్రిగా అఖిల్ సక్సెస్ చూసి మురిసిపోతున్న నాగార్జున

Post Published By: dialnews
Updated : 27 July 2026, 5:45 PM IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. దానికి ప్రధాన కారణం.. ఆయన చిన్న కుమారుడు అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే ఒక తండ్రిగా అఖిల్ సక్సెస్ చూసి మురిసిపోతున్న నాగార్జున, ఇప్పుడు తన సొంత కెరీర్‌లోని అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టారు.అదే నాగార్జున నటించబోయే మైలురాయి చిత్రం 'కింగ్ 100'!ఒక నటుడి కెరీర్‌లో 100వ సినిమా అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా విషయంలో నాగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మొదట్లో ఈ 'కింగ్ 100' చిత్రాన్ని దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకువస్తారనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే, దసరా రేస్‌లో ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి.

అలాంటి టైమ్‌లో తొందరపడి సినిమాను థియేటర్లలోకి తెస్తే థియేటర్ల కొరత లేదా కలెక్షన్ల షేరింగ్ సమస్యలు రావచ్చు. అందుకే నాగార్జున ఎలాంటి తొందరపాటు లేకుండా, "సరైన సమయం చూసి.. సరైన డేట్‌కే రావాలి" అని నిర్ణయించుకున్నారు. అందుకే దసరా బరి నుంచి ఈ సినిమాను పక్కన పెట్టారు. దసరా కాకపోతే మరే డేట్‌ను ఫిక్స్ చేస్తున్నారు? ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం చిత్ర బృందం రెండు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడం. లేదా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే అతిపెద్ద పండుగ సీజన్ అయిన 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడం.నాగార్జున కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.

అందుకే ఈ 100వ ల్యాండ్‌మార్క్ మూవీ కూడా 2027 సంక్రాంతికే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి! ఇక అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరొక ప్రాజెక్ట్.. నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ కలసి నటించే 'అక్కినేని మల్టీస్టారర్'. ఈ సినిమాను నిజానికి 2027 సంక్రాంతికి ప్లాన్ చేద్దామనుకున్నారు. కానీ, నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఈ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను నాగ్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు. 'కింగ్ 100' పూర్తయిన తర్వాతే ఈ భారీ మల్టీస్టారర్ పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు ఈ 'కింగ్ 100' సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక పోస్టర్, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నప్పటికీ.. అతిత్వరలోనే వాళ్లకు ఒక బిగ్ సర్ ప్రైజ్ లభించబోతోంది.వచ్చే ఆగస్టు నెలలో నాగార్జున పుట్టినరోజు రానుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ సెన్సేషనల్ 100వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త కథలు, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నాగార్జున, తన 100వ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Published : 
  • 27 July 2026, 5:45 PM IST