కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో ఒక పెద్ద అధ్యాయం ముగిసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలైంది. విద్యాశాఖ మంత్రి వికెట్ పడగొట్టిన CJP మరియు సోషల్ మీడియా ఉద్యమకారుల తర్వాతి టార్గెట్ ఎవరో తెలుసా..? సాక్షాత్తూ దేశంలోనే మోస్ట్ పాపులర్ మినిస్టర్.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అవును, మీరు విన్నది నిజం. 'ధర్మేంద్ర ప్రధాన్ గయా.. ఈజ్ నితిన్ గడ్కరీ నెక్స్ట్?' అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే ట్రెండ్ నడుస్తోంది. దీనికి కారణం.. E20 జనతా పార్టీ ' పేరుతో వస్తున్న ఒక సరికొత్త ఉద్యమం. కోట్లాది మంది వాహనదారుల ఆగ్రహానికి కారణమవుతున్న ఈ E20 పెట్రోల్ వివాదం ఏంటి..? నితిన్ గడ్కరీ రాజీనామా కోసం ఇండియా గేట్ దగ్గర జరగబోతున్న ఆ 'గాడీ మార్చ్' ఏంటి..? దేశం మొత్తం ఎందుకు కదిలి రాబోతోంది..?
అసలు ఈ గొడవ అంతా దేని గురించి అంటే.. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడం కోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. కానీ, ఈ E20 పెట్రోల్ వల్ల ప్రస్తుతం దేశంలో ఉన్న కోట్లాది పాత వాహనాల ఇంజన్లు ఘోరంగా పాడైపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోతోందని, ఇంజన్లలో తుప్పు పట్టి.. వేల రూపాయల రిపేర్లు వస్తున్నాయని సామాన్య జనం నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, సామాన్యుడి జేబుకు ఇది పెద్ద చిల్లులా మారింది. దీంతో లీటర్ పెట్రోల్‌కు వంద రూపాయలు పెట్టి కొంటున్నా.. మా వాహనాలు ఎందుకు నాశనం కావాలంటూ వాహనదారుల్లో తీవ్రమైన కోపం పెరిగిపోయింది.
ధర్మేంద్ర ప్రధాన్‌ను గద్దె దించడంలో సక్సెస్ అయిన CJP ఉద్యమ స్ఫూర్తితో.. ఇప్పుడు సోషల్ మీడియాలో "E20 జనతాపార్టీ" అనే ఒక కొత్త గ్రూప్ యాక్టివ్ అయింది. ఈ గ్రూప్ నేరుగా నితిన్ గడ్కరీ గారిని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నితిన్ గడ్కరీ రోడ్ల నిర్మాణంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా.. ఈ బలవంతపు E20 ఇంధన విధానాన్ని ప్రజలపై రుద్దడం వల్లే వాహనాలు పాడవుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది నెటిజన్లు వీరికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావడం లేదు ఫ్రెండ్స్. వీరు గ్రౌండ్ లెవెల్‌లో ఒక భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్ దగ్గర "గాడీ మార్చ్" పేరిట ఒక భారీ వాహనాల నిరసన ప్రదర్శనను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. "మా వాహనాలు మా ఇష్టం.. మాకు పాత ప్యూర్ పెట్రోల్ కావాలి లేదా మా వాహనాలకు జరిగిన నష్టానికి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలి" అంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య ప్రతి ఒక్క బైక్, కార్ ఓనర్‌కు సంబంధించింది కాబట్టి, ఈ 'గాడీ మార్చ్' గనుక జరిగితే.. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది వాహనదారులు, యువత ఢిల్లీకి కదిలి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విద్యాశాఖ మంత్రి విషయంలో ప్రభుత్వం ఎలాగైతే ఒత్తిడికి లొంగిందో, ఇప్పుడు రవాణా శాఖ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే, రోడ్లపై తిరిగే ప్రతి సామాన్యుడికి ఈ E20 పెట్రోల్ ఒక పెద్ద శాపంగా మారింది. ఒకవేళ ఈ నిరసనలు గనుక తీవ్రరూపం దాలిస్తే.. నితిన్ గడ్కరీ గారు ఈ విధానాన్ని వెనక్కి తీసుకుంటారా? లేదా ఇథనాల్ బ్లెండింగ్ లేని ప్యూర్ పెట్రోల్‌ను కూడా బంకుల్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విద్యావ్యవస్థ తర్వాత ఇప్పుడు ఇంధన వ్యవస్థపై దేశంలో ఒక పెద్ద యుద్ధం మొదలవబోతోంది.