తెలుగు సినిమాలో 'రీ-రిలీజ్' ట్రెండ్ ఏ రేంజ్లో నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన వింటేజ్ బ్లాక్‌బస్టర్స్, క్లాసిక్ సినిమాలను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడటం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. 'ఒక్కడు', 'పోకిరి', 'మురారి' రీ-రిలీజ్‌లకి అభిమానులు చేసిన రచ్చ, సాధించిన కలెక్షన్లు టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
ఇప్పుడు అదే జోరుతో మహేష్ బాబు కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన మరో బ్లాక్‌బస్టర్ సినిమా థియేటర్లను దద్దరిల్లించడానికి వస్తోంది! అదే.. "దూకుడు"మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు ప్రతీ ఏటా ఒక పండగ రోజే. ఈ సారి ఆ పండగను మరింత స్పెషల్‌గా మార్చడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.
ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'దూకుడు' చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన రీ-రిలీజ్ టీజర్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 2011లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' చిత్రం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అంతకుముందు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమాకు ప్రధాన బలం మహేష్ బాబు ఎనర్జీ! ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్‌గా మహేష్ బాబు చూపించిన టైమింగ్, యాక్షన్, స్టైల్ ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి.
ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించింది. ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో 'దూకుడు' పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ను సెట్ చేసింది.హీరోయిన్గా చేసిన సమంత గ్లామర్, ఆమె యాక్టింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. మహేష్ - సమంత కాంబినేషన్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ప్రకాష్ రాజ్-మహేష్ బాబుల మధ్య వచ్చే తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా, విలన్‌గా సోనూసూద్ నటన కథకి కావాల్సినంత గ్రావిటీని ఇచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సాంగ్స్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. "నీదూకుడు..", "పూవై పూవై..", "చూడే చూడే.." పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకక్కడ వింటూనే ఉంటాం. ఇప్పుడు ఈ పాటలను 4K క్వాలిటీతో, థియేటర్ డిజే సౌండ్‌లో వింటుంటే వచ్చే కిక్కే వేరు అని అభిమానులు సంబరపడుతున్నారు.