మణిరత్నం వింటేజ్ మ్యాజిక్!

ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం స్థానం ప్రత్యేకమైనది. ఆయన టేకింగ్, విజువల్స్, ఫ్రేమింగ్ మరియు కథను తెరకెక్కించే విధానం ఇండస్ట్రీలోని ఎంతోమంది యువ దర్శకులకు ఒక బిగ్ ఇన్సిపరేషన్ గా నిలిచాయి.

Post Published By: dialnews
Updated : 28 July 2026, 8:10 PM IST

ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం స్థానం ప్రత్యేకమైనది. ఆయన టేకింగ్, విజువల్స్, ఫ్రేమింగ్ మరియు కథను తెరకెక్కించే విధానం ఇండస్ట్రీలోని ఎంతోమంది యువ దర్శకులకు ఒక బిగ్ ఇన్సిపరేషన్ గా నిలిచాయి. 'రోజా', 'బాంబే', 'సఖి', 'ఓ కాదల్ కణ్మణి' వంటి ఎన్నో క్లాసిక్ లవ్ స్టోరీలతో ఆడియన్స్ మనసులను గెలుచుకున్న ఈ లెజెండరీ డైరెక్టర్.. ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో మణిరత్నం ఒక సరికొత్త ప్రేమకథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని లీక్డ్ మేకింగ్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినీ ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జోరుగా సాగుతోంది. అక్కడ అత్యంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఒక రొమాంటిక్ సాంగ్ లేదా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్టిల్స్‌లో లీడ్ పెయిర్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ట్రిమ్‌గా, హెయిర్‌స్టైల్ మరియు మేకోవర్‌లో కాస్త కొత్తగా కనిపిస్తున్నారు. మరోవైపు సాయి పల్లవి సింపుల్ లాంగ్ ప్లీటెడ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తూనే, మరికొన్ని పిక్చర్స్‌లో సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ అభిమానులను అలరిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. షూటింగ్ పిక్స్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో నెటిజన్లలో మరియు సినీ విశ్లేషకులలో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది.

మణిరత్నం ఇంకా తన పాతకాలపు లవ్ ఫార్ములాలు, రెగ్యులర్ రొమాంటిక్ ట్రాక్స్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారా? అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం కొన్ని లోకేషన్ ఫొటోలు, లీక్ అయిన పిక్స్ చూసి ఒక సినిమా కథను గానీ, దాని కాన్సెప్ట్‌ను గానీ పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ, ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వం వహించిన కొన్ని ప్రేమకథా చిత్రాల్లో ఆయన పాత సినిమాల ఫీల్, రెగ్యులర్ ఎమోషన్లే మళ్లీ కనిపించాయనే టాక్ ఉంది. ఒకప్పుడు అద్భుతంగా అనిపించిన ఆ మేకింగ్ శైలి.. మారుతున్న ప్రస్తుత కాలానికి కాస్త రోటీన్ లేదా ఔట్‌డేటెడ్‌గా అనిపించే అవకాశం ఉందని కొందరి భావన. ప్రస్తుత తరం ఆడియన్స్ మైండ్‌సెట్ గణనీయంగా మారిపోయింది. ఓటీటీల విజృంభణ వల్ల ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చుని ప్రపంచ స్థాయి సినిమా కంటెంట్‌ను చూస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చి కేవలం ఒక సాధారణ ప్రేమకథను చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. లవ్ స్టోరీ చూడాలంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత, ఒక సరికొత్త ఫీల్ లేదా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉండాలని నేటి యూత్ కోరుకుంటున్నారు.రెగ్యులర్ ఎమోషన్స్, పాతకాలపు రొమాంటిక్ సీన్స్‌తో వస్తే బాక్సాఫీస్ వద్ద సినిమాలు నిలబడటం ఈ రోజుల్లో అంత తేలికైన విషయం కాదు. ఈ మారుతున్న ట్రెండ్ గురించి మణిరత్నం లాంటి దిగ్గజ క్రియేటర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఈ విజయ్ సేతుపతి - సాయి పల్లవి కాంబినేషన్ కేవలం ఒక నార్మల్ రొమాంటిక్ లవ్ స్టోరీయేనా, లేక ఇందులో ఏమైనా స్ట్రాంగ్, పవర్‌ఫుల్ సోషల్ లేదా ఎమోషనల్ ఎలిమెంట్ దాగి ఉందా అనేదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ సేతుపతి మరియు సాయి పల్లవి యాక్టింగ్ పొటెన్షియల్‌కి మణిరత్నం మార్క్ గ్రాండియర్ విజన్ తోడైతే, ఈ సినిమా అవుట్‌పుట్ డిఫరెంట్‌గా వచ్చే అవకాశం ఉంది.మరి ఈ సినిమాతో మణిరత్నం తన మేకింగ్ స్టైల్‌ను నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అప్‌డేట్ చేసుకున్నారా లేదా అనేది రాబోయే రోజుల్లో టీజర్, ట్రెయిలర్ లేదా మరిన్ని అధికారిక వివరాలు వస్తే తప్ప స్పష్టత రాదు. ఈ క్లాసిక్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Published : 
  • 28 July 2026, 8:10 PM IST