తమిళ సూర్య, మలయాళ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన సినిమా "విశ్వనాథ్ అండ్ సన్స్". ఈ సినిమా ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలోకి వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా వెనుకున్న టీమ్ కూడా చాలా పెద్దదే! 'తొలిప్రేమ', 'సార్', లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే ఎంత వసూలు చేయాలి? ఓవర్సీస్లో బిజినెస్ ఏ రేంజ్లో జరిగింది? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలకు ఓవర్సీస్లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. థియేట్రికల్ బిజినెస్ సంబంధించి నార్త్ అమెరికా హక్కులు దాదాపు 15 కోట్లకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా అక్కడ లాభాల్లోకి రావాలంటే దాదాపు 1.8 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి.అంటే, దాదాపు 17 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడితేనే ఈ సినిమా అక్కడ 'సేఫ్ జోన్' లోకి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సూర్య కెరీర్లోనే ఓవర్సీస్లో ఒక బిగ్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు.ఆగస్టు 14న మెయిన్ రిలీజ్ ఉన్నప్పటికీ, ఓవర్సీస్లో ఒక రోజు ముందే అంటే ఆగస్టు 13నే గ్రాండ్‌గా ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
సుమారు 250 లొకేషన్లలో, 600 షోలకు పైగా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే రెస్పాన్స్ దుమ్మురేపింది! ఇప్పటికే దాదాపు 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100K డాలర్స్ వసూలు అయినట్లు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అధికారికంగా వెల్లడించింది. ఇంకా ప్రీమియర్లకు సమయం ఉంది కాబట్టి, ఈ కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ప్రాజెక్ట్‌లో రాధికా శరత్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, వైవా హర్ష వంటి పెద్ద తారాగణమే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని సమాచారం. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.