ఈ రోజుల్లో సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారడం, లక్షల్లో సంపాదించడం అంటే ఒక రేంజ్ సక్సెస్ అనుకుంటాం. కోట్ల మంది ఫ్యాన్స్, లగ్జరీ లైఫ్, నెలకు లక్షల రూపాయల సంపాదన ఉంటే ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా.. మనం ప్రాణంగా ప్రేమించిన వారు మనకు కాకుండా పోతే ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం కేరళకు చెందిన ఒక పాపులర్ యూట్యూబర్ జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇంటర్నెట్ను కదిలించివేస్తోంది. నెలకు పది లక్షలకు పైగా సంపాదన, యూట్యూబ్‌లో ఏకంగా 49 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ భార్య.. ఒక సాధారణ బస్ కండక్టర్‌తో కలిసి ఇల్లు వదిలి పారిపోయింది. అసలు ఇంత పెద్ద సెలబ్రిటీ భార్యకు బస్ కండక్టర్‌తో పరిచయం ఎలా ఏర్పడింది?
ముందుగా ఈ కథలో ఉన్న భర్త గురించి మాట్లాడుకుందాం. అతని పేరు అఖిల్, సోషల్ మీడియా ప్రపంచంలో ఆయనని 'అఖిల్ NRD' అని పిలుస్తారు. అఖిల్ ఒకప్పుడు 'మర్చంట్ నేవీ' లో చాలా మంచి పొజిషన్లో ఒక స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉండేవాడు. కానీ, సినిమా ఇండస్ట్రీ మరియు కంటెంట్ క్రియేషన్ పై ఉన్న విపరీతమైన ప్యాషన్‌తో ఆ లగ్జరీ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని యూట్యూబ్ రంగానికి వచ్చాడు. తన కష్టంతో, డిఫరెంట్ వీడియోలతో అతి తక్కువ కాలంలోనే కేరళలో టాప్ వ్లాగర్లలో ఒకడిగా ఎదిగాడు.
ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు 4.9 మిలియన్ల అంటే 49 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారానే అఖిల్ నెలకు ₹10 లక్షలకు పైగా సంపాదిస్తూ, రీసెంట్గా ఒక మలయాళ సినిమాలో కూడా యాక్ట్ చేసి తన కలని నిజం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో మంచి సక్సెస్‌లో ఉన్న సమయంలోనే అఖిల్‌కు ఆన్లైన్ ద్వారా మేఘా అనే అమ్మాయి పరిచయమైంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువైపులా ఉన్న పెద్దలను ఒప్పించి, గతేడాది నవంబర్ 2024 లో చాలా గ్రాండ్‌గా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన తర్వాత అఖిల్ తన భార్యను చాలా గౌరవంగా, ప్రాణంగా చూసుకునేవాడు. తన యూట్యూబ్ వీడియోలలో కూడా మేఘాను భాగస్వామిని చేశాడు. వీరిద్దరూ కలిసి చేసిన వ్లాగ్స్, హ్యాపీ కపుల్ వీడియోలకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. ఒక పర్ఫెక్ట్ జంటగా నెటిజన్లు వీరిని ఎంతో మెచ్చుకునేవారు. కానీ, కెమెరా ముందు కనిపించే ఈ అందమైన ప్రపంచం వెనుక.. అఖిల్ జీవితాన్ని ముక్కలు చేసే ఒక పెద్ద తుఫాను దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత మేఘా ఉన్నత చదువుల కోసం ఒక ప్రత్యేకమైన కోర్సు చదువుతానని తన భర్త అఖిల్‌తో చెప్పింది.
భార్య చదువుకు అడ్డుచెప్పకూడదని, ఆమె కెరీర్‌కు సపోర్ట్ చేయాలని భావించిన అఖిల్.. వెంటనే భారీ ఫీజు కట్టి ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. అఖిల్ తన షూటింగ్స్, సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల.. మేఘా ప్రతిరోజూ ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్లడానికి ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణించేది. ఈ క్రమంలోనే, ఆ బస్సులో పనిచేసే ఒక లోకల్ బస్ కండక్టర్ తో ఆమెకు రోజూ పరిచయం ఏర్పడింది. భర్త ఇచ్చే లగ్జరీ లైఫ్, సమాజంలో ఉన్న గౌరవం, కోట్ల రూపాయల ఆస్తి.. ఇవేవీ ఆమెకు కనిపించలేదు. రోజూ ప్రయాణంలో కలిసే ఆ కండక్టర్ మాటలకు మేఘా ఆకర్షితురాలైంది. వారి మధ్య చాటింగ్‌లు, ఫోన్ కాల్స్ పెరిగిపోయి.. చివరకు భర్తను వదిలేసి అతనితో వెళ్ళిపోవాలనే భయంకరమైన నిర్ణయానికి వచ్చేలా చేశాయి.
కొన్ని రోజుల క్రితం, ఎప్పటిలాగే ఇన్స్టిట్యూట్కు వెళ్లిన మేఘా.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కంగారుపడిన అఖిల్ తన భార్య ఫోన్ చేయగా అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. చుట్టుపక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. తన భార్యకు ఏదో ప్రమాదం జరిగిందని భయపడిన అఖిల్.. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 'భార్య కనిపించడం లేదు' అంటూ కేసు పెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె వెళ్లే దారిలో ఉన్న బస్ స్టాండ్లు, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజ్ చూసిన పోలీసులతో పాటు భర్త అఖిల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ వీడియోలో మేఘా తన లగేజ్ బ్యాగులతో సహా వచ్చి.. ఆ బస్ కండక్టర్‌తో కలిసి బైక్‌పై హ్యాపీగా వెళ్ళిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ స్టోరీ ఒక పెను సంచలనంగా మారింది. అఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే, ఇంత పెద్ద మోసం జరిగినా యూట్యూబర్ అఖిల్ మాత్రం ఎవరినీ నిందించకుండా, ఎమోషనల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు, పేరు, సమాజంలో హోదా, ప్రాణంగా చూసుకునే భర్త ఉన్నా కూడా.. కొంతమంది ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదంటూ నెటిజన్లు మేఘాపై తీవ్రంగా మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో కనిపించే ప్రతి హ్యాపీ కపుల్ వెనుక ఉన్న నిజ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. కోట్ల రూపాయల సంపాదన కంటే నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యమని ఈ కథ నిరూపిస్తోంది.