ప్రభాస్ ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు.!

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. ‘రాజా సాబ్’ తర్వాత ఆయన తదుపరి సినిమాల లైన్-అప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’,

Post Published By: dialnews
Updated : 17 August 2026, 9:55 AM IST

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. ‘రాజా సాబ్’ తర్వాత ఆయన తదుపరి సినిమాల లైన్-అప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’, మరోవైపు ప్రశాంత్ నీల్ తో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ తో ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు డార్లింగ్.
అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇన్స్టాగ్రామ్‌లో తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు, చిన్న-పెద్ద తేడా లేకుండా ఇతర హీరోల సినిమాలకు, ఇండస్ట్రీ వర్గాలకు సపోర్ట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు. ఇన్స్టాగ్రామ్‌లో ప్రభాస్ కు ఏకంగా 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ ఇన్స్టాగ్రామ్‌లో మాత్రం కేవలం 28 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.ప్రభాస్ ఫాలో అవుతున్న ఆ 28 మంది లిస్ట్ పరిశీలిస్తే.. అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,అనుపమ్ ఖేర్,వివేక్ ఓబెరాయ్ వంటి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులను ఆయన ఫాలో అవుతున్నారు.

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది! ప్రభాస్ ఇన్స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న టాలీవుడ్ హీరో ఎవరు అని ప్రశ్నిస్తే.. చాలామంది వెంటనే రాణా దగ్గుబాటి లేదా గోపీచంద్ పేర్లు చెప్తారు. ఎందుకంటే బాహుబలి సినిమా నుంచి రాణాతోనూ, కెరీర్ ప్రారంభం నుంచి గోపీచంద్ తోనూ ప్రభాస్ కు ఎంతో గాఢమైన స్నేహం ఉంది.కానీ, ప్రభాస్ వీరిద్దరినీ ఇన్స్టాగ్రామ్‌లో ఫాలో కావడం లేదు. మరి టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఫాలో అవుతున్న ఆ ఒక్కే ఒక్క హీరో తన పెదనాన్న, దివంగత రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు.తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన కృష్ణంరాజు గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ తో కలిసి ఆయన 'బిల్లా', 'రెబెల్', 'రాధే శ్యామ్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సొంత పెదనాన్నగానే కాకుండా, తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి దారి చూపించిన మార్గదర్శిగా కృష్ణంరాజు గారిపై ప్రభాస్ కి ఉన్న అభిమానం, గౌరవం వర్ణించలేనిది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఇన్స్టాగ్రామ్‌లో ఆయన అధికారిక ఖాతాను ఫాలో అవుతూ తన ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు ప్రభాస్.

Published : 
  • 17 August 2026, 9:55 AM IST