సిద్ధిపేట జిల్లాలో వరుసగా లేడీస్ మిస్ అవుతున్నారు. ఎవరో వాళ్లను చంపి శవాలను మాయం చేస్తున్నారు. వీళ్ల మర్డర్ వెనక ఉన్న కామన్ పాయింట్.. మిస్ అవుతున్న మహిళలందరికీ ఎవరో ఒకరితో ఆస్తి తగాదానో కుటుంబ తగాదానో ఉంటోంది. కానీ.. లేడీస్‌ను చంపుతోంది వాళ్లు కాదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాని ఈ క్రైమ్‌ను డీకోడ్ చేస్తే తెలిసింది ఏంటంటే.. ఆ ఊర్లో టీషాప్ నడిపే ఒక లేడీ ఇలా అందర్నీ చంపి శవాలు మాయం చేస్తోంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి అనే గ్రామంలో.. రజిత అనే లేడీ ఆమె భర్త దుబ్బయ్య, కొడుకుతో కలిసి ఉంటోంది. ఆ ఊర్లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల దగ్గర చిన్న టీ షాపు నడుపుతుంది. రజిత భర్త దుబ్బయ్య పేషెంట్. బెడ్ మీద నుంచి లేవలేడు. సో.. ఫ్యామిలీ భారం మొత్తం రజిత మీదే ఉంది. ఫ్యామిలీని పోషించడానికి ఆమె ఎంచుకున్న మార్గం దోపిడీలు. వాళ్ల టీ షాప్ దగ్గర అందరూ మాట్లాడుకునేది విని.. ఊర్లో ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ అని ప్లాన్ చేసేది. ఆమె టార్గెట్ ఒంటరి మహిళలు, ఎవరితో అయినా గొడవలు ఉన్న మహిళలు. ఇలాంటి వాళ్లను మర్డర్ చేస్తే పోలీసుల ఫోకస్ మొత్తం వాళ్ల ఎనిమీస్ మీదకు వెళ్తుంది కానీ ఈమె మీదకు రాదు అది ప్లాన్.
ఈ స్టోరీలో ఫస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే.. ఈ దోపిడీలకు ఆమెకు ఉన్న పాట్నర్.. మైనర్‌గా ఉన్న ఆమె కొడుకు. మర్డర్స్ కూడా వాడి హెల్స్‌తోనే చేసింది. యూట్యూబ్‌లో వాడికి క్రైమ్ సినిమాలు చూపించి మర్డర్స్ ఎలా చేయాలో నేర్పించింది. అవతల వాళ్లు ఎటాక్ చేస్తే తట్టుకునేలా కొడుకు స్ట్రాంగ్‌గా ఉండటానికి ఇంట్లోనే జిమ్ కూడా సెటప్ చేసి.. రోజూ కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చేది. ప్లాన్ ప్రకారం వీళ్లు చేసిన ఫస్ట్ మర్డర్.. రేఖ అనే మహిళది.రేఖ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేది. కొడుకు సాయంతో ఆమెను మర్డర్ చేసి.. ఆమె దగ్గరున్న బంగారం మొత్తం తీసుకుని ఆమె బాడీని దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే పోలీసులు ఫస్ట్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టారు. రజిత్ మీద ఎవరికీ డౌట్ రాలేదు. రజిత టార్గెట్ చేసిన సెకండ్ పర్సన్ అన్నపూర్ణ అనే లేడీ. ఆమె వాకింగ్ చేసే టైంలో ముసుగు వేసి ఆమె మీద దాడి చేసి తల్లి కొడుకులు ఆమె దగ్గరనున్న బంగారం దోచుకున్నారు. కొంత గ్యాప్ తరువాత జూలై 17న వాళ్ల ఊర్లోనే ఉండే విజయ అనే మహిళను టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారం చంపేసి శవాన్ని పూడ్చేయడానికి తీసుకెళ్తున్నారు. కానీ అనుకోకుండా వర్షం పడింది. దీంతో శవాన్ని పూడ్చకుండా కాల్చేద్దామని డిసైడ్ అయ్యారు.
పెట్రోల్ పోసి శవానికి నిప్పంటించి వెళ్లిపోయారు. కానీ వర్షం ఎక్కువగా పడి శవం సరిగ్గా కాలలేదు. ఆ సగం కాలిన డెడ్‌బాడీని అక్కడి లోకల్స్ గుర్తించి పోలీసులకు చెప్పారు. ఆ డెడ్ బాడీ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తే.. అప్పుడు రజిత చేసిన ఈ మర్డర్స్ అన్నీ బయటికి వచ్చాయి.ఈ కథలో రెండో ట్విస్ట్ ఏంటంటే.. రజిత ఈ నేరాలు మొదలు పెట్టింది బయటి వ్యక్తులతో కాదు. రజిత భర్త పేషెంట్.. బెడ్‌కే పరిమితం అని స్టార్టింగ్‌లో చెప్పారు కదా.. నిజానికి ఆయన పేషెంట్ కాదు.. పేషెంట్‌ని చేశారు. భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి అతన్ని చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసింది రజిత. కానీ ఆమె ప్లాన్ బెడిసికొట్టి ఆయన చనిపోకుండా మంచానికి పరిమితమయ్యాడు. రజిత్ హిట్ లిస్ట్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. విజయ తరువాత మర్డర్స్ చేసిందుకు ఆల్రెడీ నలుగురు లేడీస్‌ని సెలెక్ట్ చేసి పెట్టింది రజిత. కానీ అనుకోకుండా విజయ మర్డర్‌తో విషయం మొత్తం బయటికి వచ్చింది. కొడుక్కి బుద్ధి నేర్పించాల్సిన తల్లి.. ఆ కొడుకుని కిల్లర్‌గా మార్చి ఇన్ని మర్డర్స్ చేసింది. ఇదంతా వింటుంటే ఈ స్టోరీతో ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తోంది కదా.