Top story: మాట్లాడండి మేడం…. ప్లీజ్ మాట్లాడండి..!హోం మంత్రి అనిత దేనికి స్పందించరా..?

రాష్ట్రంలో ఏం జరిగినా ఏపీ హోం మంత్రి అనిత మాట్లాడరు. తన శాఖకు సంబంధించి అస్సలు మాట్లాడరు. విజయవాడలో పోలీసులు ఒకరిని చంపి శవాన్ని మాయం చేస్తే... దర్యాప్తు జరుగుతోంది అని ముక్తసరిగా ఒక మాట అంటారు అంతే.

Post Published By: dialnews
Updated : 29 August 2026, 3:26 PM IST

రాష్ట్రంలో ఏం జరిగినా ఏపీ హోం మంత్రి అనిత మాట్లాడరు. తన శాఖకు సంబంధించి అస్సలు మాట్లాడరు. విజయవాడలో పోలీసులు ఒకరిని చంపి శవాన్ని మాయం చేస్తే... దర్యాప్తు జరుగుతోంది అని ముక్తసరిగా ఒక మాట అంటారు అంతే. ప్రకాశం జిల్లాలో పోలీసుల దగ్గర గంజాయి దొరికిన ...స్పందించరు. రాజమండ్రిలో ఒక లేడీ డాక్టర్ని ఇద్దరు నీచులు పనిగట్టుకుని కారుతో గుద్ది చంపేస్తే కూడా రియాక్ట్ అవ్వరు. ఆ కేసులో నిందితుల్ని వెంటనే ఎందుకు పట్టుకోలేదో పోలీసుల్ని అడగరు. ఇలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దేనిపైన ఆమె స్పందించరు. పార్టీ హై కమాండ్ మాట్లాడ వద్దని చెప్పిందో.... అసలు హోంశాఖ తనది కాదని అనిత భావిస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి రాష్ట్రంలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా హోం మంత్రి మాత్రం దేనికి స్పందించరు. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను విమర్శలతో, తిట్లతో, సెటైర్లతో ఎండగడతారు.

రాష్ట్రంలో అత్యంత కీలకమైనది హోమ్..శాఖ. రాష్ట్రంలో ఏం జరిగినా ఆ శాఖ మంత్రి క్షణాల్లో స్పందించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సిన హోం మంత్రి అనిత ఈమధ్య పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఏ ఘటనలు జరిగినా స్పందించాల్సిన రీతిలో రియాక్ట్ కావటం లేదు. అసలు తాను హోం మంత్రిని అన్న విషయం మర్చిపోయారా ? అని జనంలో డౌట్ వస్తుంది.
ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ హోం శాఖ పైన చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఏపీ హోం శాఖలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించారు. తాను హోం శాఖ తీసుకుంటానని కూడా హెచ్చరించారు. అయినా మార్పు లేదు. ఏపీలో పోలీసుల ప్రవర్తన, పోలీస్ స్టేషన్లో దుర్మార్గాల పై దేశమంతా చర్చ జరుగుతున్న హోం మంత్రి మాత్రమే రియాక్ట్ అవటం లేదు.

2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక సమీకరణాల ఆధారంగా అనిత ఏపీ హోం మంత్రి అయ్యారు. తొలి రోజుల్లో తన శాఖా పరంగా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆఘమేఘాల మీద వెళ్లేవారు. అయితే ఎందుకో హోం మంత్రి లో ఆ వేగం లోపించింది. స్పందన కనిపించడం లేదు. కానీ అదే సమయంలో ప్రత్యర్థి పార్టీపై రాజకీయ విమర్శలు గుప్పించాలంటే మాత్రం అందరికంటే ముందే దూకుతున్నారు. అనిత హోం మంత్రిగా కంటే టిడిపి ప్రతినిధి గానే ఎక్కువ స్పందిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు హోం మంత్రి స్పందన ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుందని సొంత కేబినెట్ సహచరులే కామెంట్ చేస్తున్నారు.

శాంతి భద్రతలు నేరుగా ప్రజల కు సంబంధించిన అంశం. ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రజల్లో చర్చ మొదలవుతుంది. ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే ప్రజల్లో నిరసన రావటం ఖాయం. ప్రకాశం జిల్లా అద్దంకి లో ఇటీవల పోలీసుల దగ్గరే గంజాయి దొరికింది. దీని పైన హోం మంత్రి వెంటనే స్పందించి శాఖా పరమైన నిర్ణయాలు తీసుకుని ఉంటే రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలకు అవకాశం ఉండేది కాదు. అసలు ఆ సంఘటనే తనకు తెలియనట్లు ఇప్పటికీ అనిత మౌనంగానే ఉన్నారు. అదే విధంగా రాజమండ్రిలో మెడికో ప్రియాంకను తాగుబోతులు పాశవికంగా కారుతో యాక్సిడెంట్ చేసి.. చంపినా హోం మంత్రి సీరియస్ గా స్పందించక పోవటం విమర్శలకు అవకాశం ఇచ్చిందనే టాక్ ఉంది.... అదే విధంగా గుంటూరు లో ఒక మహిళను వివస్త్ర చేసి కొట్టిన ఘటన పైనా హోంమంత్రి సకాలంలో స్పందించకపోవటం పై విమర్శలు వచ్చాయి.

అన్నిటి కన్నా ముఖ్యంగా విజయవాడలో లాకప్ డెత్ కు సంబంధించి అనిత స్టేట్మెంట్ పేలవంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.... కేవలం దర్యాప్తు చేస్తామని సరిపెట్టడం తప్ప.....అంత పెద్ద ఎపిసోడ్ ను సీరియస్ గా తీస్కున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జరిగిన పోలీస్ ట్రాన్స్ఫర్ లో కూడా హోం మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే రౌడీ షీటర్లకు పెరోల్ ఇచ్చి ఆమె ఇరుకనపడ్డారు
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా అరికడతామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. రెండేళ్లు దాటిపోయిన ఏపీలో గంజాయి ఎక్కడ కంట్రోల్లోకి రాలేదు. చివరికి పోలీసులు దగ్గర కూడా గంజాయి దొరుకుతుంది.

అసలు శాఖకు సంబంధించిన సమాచారమే హోంమంత్రి అనిత దగ్గర ఉండటం లేదని విమర్శ బాగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికిస్తున్న గంజాయి డాన్ గురించి మీడియా అడిగితే తెల్లబోయి చూశారు అనిత. పక్క రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్ దొరికితే అది మనమే పట్టుకున్నామని చెప్పుకొని అడ్డంగా దొరికి పోయారు ఆమె.హోం శాఖ కంటే ప్రతిపక్షం పైన విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రతిపక్షాన్ని విమర్శించటం ద్వారా ప్రభుత్వంలో పెద్దల వద్ద మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఇప్పటికే జనంలో వచ్చేసింది. ఏపీలో శాంతి భద్రతల వ్యవహారం.. హోం మంత్రిగా అనిత పనీ తీరు పైన కూటమి నేతల్లోనే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అసలు హోం మంత్రికి వారు వారం హైదరాబాదులో ఏం పని అని కూటమినేతలే ప్రశ్నిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ హోం శాఖ పై వ్యాఖ్యలు చేసిన దగ్గర్నుంచి హోమ్ మంత్రి పనితీరు పై అందరూ దృష్టి దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఇటీవల వరసగా జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వ పనితీరుని ప్రశ్నిస్తున్నాయి. దీంతో అందరి ఫోకస్ మొత్తం హోమ్ శాఖ పైనే ఉంది. అసలు హోం మంత్రికి ఆ శాఖ పని ఏంటో కూడా అర్థం కావడం లేదని కొందరు సీనియర్ పోలీసు అధికారులు ప్రవేట్ పార్టీలో జోకులు వేసుకుంటున్నారు. అసలు కొందరు అధికారులైతే ఆమెకి నేరుగా రిపోర్టింగ్ కూడా చేయటం లేదు.ఇదే విషయం అనిత తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయారట. అక్కడ సిస్టం అలా ఉంది... మనం ఏం చేస్తాం?మనకి ఎంత స్కోపు ఉంటే అంతే చేస్తాం అని వైరాగ్యం ప్రదర్శిస్తున్నారట. ప్రభుత్వ పెద్దలు తనని చేయనివ్వడం లేదని పరోక్షంగా చెబుతున్నారు అనిత. అయితే పార్టీలో పెద్దలు మాత్రం మరో రకంగా గౌరవిస్తున్నారు. హోం శాఖపై అనితకు సబ్జెక్టు లేదని... ప్రతి సంఘటనపై ఆమె ఏది పడితే అది మాట్లాడితే... పొలిటికల్ గా ఇరుకున పడతామనీ.... అందుకనే అనిత మాట్లాడటం లేదని చెప్తున్నారు.

 

 

Published : 
  • 29 August 2026, 3:26 PM IST