Top story: టాక్సిక్ రాడ్ లకే రాడ్డు….. వెళ్లారా….. చచ్చారే?

ట్రైలర్ చూసి అబ్బో ఇంకేం లేదు ఊపేస్తుందనుకున్నారు.. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చూసి రచ్చ రంబోలా అన్నారు. ఇరా థియేటర్లో బొమ్మ పడ్డాక ఇంతకంటే బోకు సినిమా గతంలో రాలేదు.... భవిష్యత్తులో రాదు అని అర్థమైంది

Post Published By: dialnews
Updated : 27 August 2026, 10:55 AM IST

ట్రైలర్ చూసి అబ్బో ఇంకేం లేదు ఊపేస్తుందనుకున్నారు.. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చూసి రచ్చ రంబోలా అన్నారు. ఇరా థియేటర్లో బొమ్మ పడ్డాక ఇంతకంటే బోకు సినిమా గతంలో రాలేదు.... భవిష్యత్తులో రాదు అని అర్థమైంది. యష్ సరికొత్త మూవీ టాక్సిక్ ఓవరాల్ రివ్యూ ఇది. సినిమా మొత్తం హీరో వేరే వాళ్ళని కాల్చడం... మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు రోత రొమాన్స్ చేయడం ఇంతకు మించి టాక్సిక్ లో ఇంకేం ఉండదు. సోషల్ మీడియాలో ఒక విమర్శకుడు ధైర్యానికి.... వీర్యానికి మధ్య జరిగిన కార్యం.... అని వెటకారం చేశాడంటే.... దానిలో నిజం ఉందనే అర్థం. పేరుకు తగినట్లే సినిమా అంతా టాక్సీ కే. గోవాలో గ్యాంగ్స్టర్ అయిన హీరో జీవితంలో ఎదురైన ఘటనలే టాక్సిక్ స్టోరీ.

రిచ్ మేకింగ్ అని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఏం కనిపించలేదు. హీరో ఎలివేషన్ షాట్స్ తప్పఓవరాల్ గా మూవీలో డైరెక్టర్ గీతు పీకింది ఏమీ లేదు. ఈ ఎలివేషన్స్ వల్లే కథ సైడ్ ట్రాక్ పట్టింది. స్టోరీ మొత్తం రొమాన్స్, వైలెన్స్ తప్ప ఇంకేం కనిపించవు. అంత భారీ క్యాస్టింగ్ కూడా లేడీ డైరెక్టర్ యూస్ చేసుకోలేకపోయింది. సెకండాఫ్ బోర్ కొట్టిస్తే.... మ్యాక్స్ విసుగు పుట్టించింది. ఇక సినిమా లెంత్, బిజిఎం మూవీకి పెద్ద మైనస్ పాయింట్లు. ఈ మధ్యకాలంలో ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన మూవీ లేదు. ఒక రకంగా డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్ గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కి ఆది పురుషులాగా.... యష్ కెరీర్లో టాక్సిక్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేరు అనే విషయాన్ని ఇండస్ట్రీ వాళ్లు తెలుసుకుంటే మంచిది. నాలుగు బోల్డ్ సీన్లు పెట్టేస్తే జనం ఎగేసుకుంటూ థియేటర్లకి వచ్చేస్తారని కూడా చాలా పొరపాటు.

సాక్షి కొచ్చిన నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ తో పాటు ఓటిటి, సాటిలైట్ డీల్స్ పై కూడా పడనుంది. రిలీజ్ కి ముందు మేకర్స్ టాక్స్ కి 250 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్లాట్ఫార్మ్స్ ముందుకు రాలేదు. ఇప్పుడు మూవీ డిజాస్టర్ అవడంతో చాలా లోయెస్ట్ రేటు ఆఫర్ చేసే అవకాశం ఉంది.టాక్సిక్ పుణ్యమా అని.... బాగా ఆడుతున్న రవితేజ ఇరుముడి నీ ఎత్తేసి ఎక్కువ సినిమాకి థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు టాక్సిక్ డిజాస్టర్ కావడంతో ఇరుముడికి అది ప్లస్ పాయింట్ అయింది. టాక్స్ ఎక్కిన పీకేసి ఇరుముడికి థియేటర్లు ఇచ్చే అవకాశం ఉంది. హీరో యష్ కూడా,ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. కేవలం ఎలివేషన్స్ మీదే ఆధారపడి సినిమాలు తీసే డైరెక్టర్లకు దూరంగా ఉంటే భవిష్యత్తులో ఎస్ బతికి బట్టకడతాడు. లేదంటే ఎస్ ఫినిష్ అవుతాడు.

 

 

Published : 
  • 27 August 2026, 10:55 AM IST