Top story: భర్త మహాశయులు.. బహు పరాక్ భర్తల్ని, భార్యలు ఎందుకు చంపుతున్నారు? తప్పు ఎవరిది?

తాగొచ్చి హింసిస్తున్నాడని మొగుడ్ని చంపడం లేదు. వరకట్నం తేవాలని టార్చర్ పెడుతున్నాడని భర్తల్ని హత్యలు చెయ్యడం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని లేపేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 11:15 AMLast Updated on: Jan 26, 2026 | 11:15 AM

Why Are Wives Killing Their Husbands Whose Fault Is It

తాగొచ్చి హింసిస్తున్నాడని మొగుడ్ని చంపడం లేదు. వరకట్నం తేవాలని టార్చర్ పెడుతున్నాడని భర్తల్ని హత్యలు చెయ్యడం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని లేపేస్తున్నారు. ప్రియుడితో జల్సాగా తిరగడానికి పానకంలో పూడకలా తయారయ్యాడని మొగుళ్లను పైలోకాలకు పార్సిల్ చేస్తున్నారు,భర్తలను చూసి భార్యలు భయపడే రోజులు పోయి…భార్యలను చూసి భర్తలు భయపడే రోజులొచ్చాయి. ఇల్లీగల్ ఎఫైర్స్ తో భర్తలను హత్యచేస్తున్న భార్యల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో వరకట్న వేధింపులు తాళలేకనో, లేదంటే క్షణికావేశంలో భర్తలను చంపిన ఉదంతాలు ఉండేవి. కానీ ఈమధ్యకాలంలో జరుగుతున్న మొగుళ్ల హత్యలకు ఏకైక కారణం వివాహేతర సంబంధాలే. మొగుడు అడ్డొస్తున్నాడని, అడ్డంగా చంపేస్తున్నారు భార్యామణులు. సోషల్ మీడియా పరిచయాలో, ఇరుగుపొరుగు కొత్త ఆలోచనలో, పని చేసే చోట పలకరింతలో కుటుంబానికి తల లాంటి భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ భార్యామణి భర్తను చంపి, అతని శవం పక్కన కూర్చుని పోర్న్ వీడియోలూ చూస్తూ…రాక్షసత్వానికి నిలువెత్తు రూపంలా తెలుగు రాష్ట్రాలను భయపెట్టింది.

సున్నితత్వానికి మారుపేరుగా చెప్పుకునే ఆడవారిలో ఇంత క్రూరత్వమా..?.ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చెయ్యడమే కాకుండా శవాన్ని పక్కన పెట్టుకుని పోర్న్ వీడియోలు చూసేటంత పైశాచికమా..?ఒక్కో ఇల్లాలి క్రిమినల్ ఐడియాలు చూస్తుంటే…సూపర్ కంప్యూటర్ కూడా పనికిరాదేమోననే డౌట్ వస్తుంది. ఆడవాళ్లకు కొత్త పరిచయాల వైపు ఉసిగొల్పింది సోషల్ మీడియా రీల్స్ పైత్యమే. స్టోరీకి లైక్‌ కొట్టారనో, వారెవ్వా మేడమ్ ఏం డ్యాన్స్ చేశావని ప్రశంసించాడనో, ఇట్టే పొగడ్తలకు పడి పోతున్నారు కొందరు హౌస్‌ వైఫ్స్. ఆ పరిచయాలు కాస్తా ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లా మారి…దారుణాలకు దారి తీస్తున్నాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో, కొత్తకొత్త పరియాలు కూడా పెరుగుతున్నాయి. అవతలి నుంచి మేడమ్ మీరు సూపర్, మీ యాక్టింగ్ సూపర్, మీరేం తింటారు మేడమ్, ఇంత అందంగా వుంటారు అని కల్లబొల్లి పొగడ్తలు కురిపించేసరికి, ఈ ఇల్లాలి మైండ్ గింగిరాలు తిరిగిపోయి…ఎన్నడూ వినని పొగడ్తలతో ఐసయిపోతుంది. చివరికి అలాంటి పొగడ్తలనే ఎక్కువ ఆశించి, అతని ఫోన్ సంభాషణ వరకు వెళ్తుంది…చివరికి వన్ ఫైన్ ఈవెనింగ్ ఓ కాఫీ షాప్‌లోనో, రెస్టారెంట్‌లోనో, పార్కులోనో…ముఖాముఖి పరిచయాలు పెరుగుతాయి. ఇవి కాస్త వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. చివరికి ఈ ఎఫైర్‌కు అడ్డొస్తున్న భార్తను చంపేంత క్రూరత్వ ఆలోచనకు తెగిస్తున్నారు.

భార్యలు తమ భర్తలను ఎంత లేదు దారుణంగా, కిరాతకంగా హతమారుస్తున్నారో చెప్పడానికి ఎన్నో ఉదంతాలు. ఆమెలోని మోహం… విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. చాలామంది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా… ప్రియుడి కౌగిలినే కోరుకుంటున్నారు. ఆ సమయంలో హాయిగా అనిపించిన వివాహేతర సంబధం జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ప్రియుడితో కలసి భర్తలను అంతం చేస్తున్నారు. ఈ మధ్య అలాంటివి చాలా హత్యలు. అన్నింటిలోనూ భార్యలే నేరస్థులు. వాళ్ల ప్రియుళ్లు కూడా నేరంలో భాగమే. మూడు ముళ్లు, ఏడడుగులు, ముద్దులొలికే చిన్నారులు. ఇవేవీ వారిని అడ్డుకోలేకపోతున్నాయి.భర్తల్ని చంపుతున్న భార్యల్లో మెజార్టీ కేసుల్లో పశ్చాత్తాపం కనిపించటం లేదు. అసలు హత్య చేస్తే దొరికిపోతామనే భయం కూడా లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకుని.. తమకు నచ్చినట్టుగా బతకొచ్చనే ధోరణే కనిపిస్తోంది. భర్తల కారణంగానే తమ స్వేచ్ఛకు కళ్లెం పడుతుందనే భ్రాంతిలో ఉంటున్న భార్యలు.. అనుభవిస్తున్న జీవితపు విలువను గుర్తించడం లేదు. పైగా ఈ మాత్రం జీవితం కంటే మెరుగైన బతుకు బతకగలమనే పోకడ కనిపిస్తోంది. చివరికి జైల్లో చిప్పకూడు తప్పదని తెలుసుకోలేకపోతున్నారు.

భర్తల్ని చంపితే మెరుగైన జీవితం గడపొచ్చనే ఊహలే కానీ.. వాస్తవంలో అది నిజం కాదనే విషయం.. కొందరు భార్యలకు అంతా అయిపోయాకే అర్థమవుతోంది. అక్రమ పొద్దుట సంబంధం మనుషులనే కాదు మానత్వాన్ని కూడా చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ఐదేళ్లలో 2 వేలమంది భర్తలు….భార్యలకు బలయ్యారు. ఒంగోలు జిల్లాలో జైల్లో వున్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ హత్య చేసి, జైలుపాలయ్యింది ఓ భార్య. నిజానికి పురుషాధిక్య సమాజంలో అత్యధిక బాధితులు మహిళలే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతకాలంగా జరుగుతున్న హత్యల ఉదంతాలు ఇందుకు భిన్నంగా. భర్తల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.

తాగొచ్చి భర్త కొడుతున్నాడన్న విసుగుతో చంపేస్తున్న ఘటనలు చాలా తక్కువ. డౌరీ హరాస్‌మెంట్‌ను భరించలేక కొడుకు, పిల్లలతో కలిసి మొగున్ని కడతేరుస్తున్న కారణాలు కూడా తక్కువ. భర్తల హత్యల్లో మెజార్టీ అంశం మాత్రం ఇల్లీగల్ ఎఫైరే. విశాఖలోనూ ఓ పెళ్లాం…మొగున్ని ఇలాగే పైకి పంపించింది.నేరాలు ఘోరాల విషయంలో మహిళా సాధికారత పెరగటం ఆందోళనకు కారణమౌతోంది. చదువు, ఉద్యోగం, సమాజంల హోదా, మంచి కుటుంబ నేపథ్యం.. ఇలాంటివి భార్యలకు మరింత ధైర్యాన్నిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇవేమీ లేని భార్యలు కూడా భర్తల్ని చంపటానికి తెగబడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. భర్తల్ని చంపితే మెరుగైన జీవితం గడపొచ్చనే ఊహలే కానీ.. వాస్తవంలో అది నిజం కాదనే విషయం.. కొందరు భార్యలకు అంతా అయిపోయాకే అర్థమవుతోంది.

సోషల్ మీడియా కనెక్షన్స్, ఇరుగుపొరుగు పరిచయాలు, పని చేసే చోట మాటలు రకరకాల మలుపులు తిరుగుతూ కొందరు భార్యల్లో వున్న కిరాతకాన్ని వెలికి తీస్తున్నాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెక్కీ చేసి మరీ భర్తల్ని చంపుతున్నారు. దారి కాచి చంపేవారు కొందరైతే.. అలవాట్ల ఆధారంగా హరీ అనిపించేవారు మరికొందరు. గుట్టుచప్పుడు కాకుండా ప్రాణం తీసేసి.. శవాన్ని మాయం చేసి.. ఏమీ తెలియనట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తేనె పూసిన కత్తులు ఇంకొందరు. ఇలా భర్తల్ని మర్డర్ చేయడంలో కూడా ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు, అంటే ఐదేళ్లలో 2 వేలకు పైగా భర్తలను చంపిన కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. చివరికి వీరు సాధించిందేం లేదు…కటకటాలు..చిప్పకూడు తప్ప.