Top story:బొగ్గుగని చుట్టూ తెలంగాణ రాజకీయం, ఐఏఎస్ లు, జర్నలిస్టులు ఫూల్స్ అయ్యారా?
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు ఆడుతున్న వికృతమైన ఆటలో చివరికి అధికారులు, ఆ…యా …సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు ఫూల్స్ అయ్యారు. పరువు పోగొట్టుకున్నారు. ఈ ఓవరాల్ గేమ్ లో అసలు ఎవరి పాత్ర ఏమిటి? ఏమిటి బొగ్గు గని రాజకీయం? బొగ్గు గని వెనుక నిజంగా ఎవరున్నారు? ఈ వాటాల పంచాయతీ ఎవరెవరి మధ్య జరుగుతుంది? దానికి ఫైనల్ గా ఐఏఎస్లు, జర్నలిస్టులు ఎలా బలయ్యారు….?
ఒరిస్సా లోని నైని ప్రాంతంలో ఉన్న బొగ్గు గని అత్యంత పురాతనమైనది. ఇక్కడ బొగ్గు తవ్వడం కూడా చాలా క్లిష్టమైన పని. ఈ బొగ్గుగనినీ సింగరేణి కార్పొరేషన్ దక్కించుకుంది. సింగరేణి కార్పోరేషన్ నుంచి దీనిని పాతికేళ్లపాటు లీజుకు తీసుకొని బొగ్గు గని ని తవ్వుకోడానికి కొన్ని ఇన్ఫ్రా సంస్థలు టెండర్లు వేశాయి. 25 ఏళ్ల పాటు బొగ్గు గని లీజుకు తీసుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే గని ఇది. ఈ టెండర్ల ప్రక్రియ అంతా సింగరేణి యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తో తనకు సంబంధం లేదని చెప్తుంది. కానీ సింగరేణి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వం కను సన్నల్లోనే ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకి అది కేటాయించొచ్చు. కాకపోతే టెండర్ అతి తక్కువ వేసిన వాళ్ళకి రూల్ ప్రకారం బొగ్గు గని కాంట్రాక్టు దక్కుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనే అది సాధ్యమవుతుంది.
నైనీ కోల్ మైన్ కాంట్రాక్టు కోసం తెలంగాణలో చాలామంది ఇన్ఫ్రా కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు. ఏఎంఆర్ మహేష్ రెడ్డి. చాలా అనుభవం ఉన్న ఇన్ఫ్రా కంపెనీ అధినేత. ఏపీలో చంద్రబాబుకి, తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇద్దరికీ బాగా కావాల్సిన వ్యక్తి. అంతేకాదు కోల్ మైనింగ్ లోను మహేష్ రెడ్డికి విస్తృతమైన అనుభవం ఉంది. ఏ ఎం ఆర్ మహేష్ రెడ్డికి నైని బొగ్గు గని కట్టబెట్టాలని ప్రభుత్వంలో ఒక బలమైన వర్గం భావిస్తుంది. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడుతాడిచర్ల కోల్ మైన్నీ ఏ ఏం ఆర్ మహేష్ రెడ్డికి 25 ఏళ్ల ప్లీజ్ కి ఇచ్చారు, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తాడిచర్ల కోల్ మైన్ ని సింగరేణికి ఇస్తే…. తమకు సామర్థ్యం లేదని చెప్పి టిఆర్ఎస్ హయాంలో తాడిచర్ల ను ఏఎంఆర్ మహేష్ రెడ్డికి ఇచ్చేశారు .అందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్నాయి.ఇక రెండో వర్గం ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి బంధువులకు చెందిన వెన్సర్ గ్రూప్. ఈ వెన్సార్ గ్రూప్ తో కలిసి మేఘ ఇంజనీరింగ్ కూడా నైని బొగ్గు గని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నరేంద్ర చౌదరి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మధ్య దశాబ్దాల కాలంగా స్నేహం ఉంది. కనుక ఈ వర్గం కోసం బట్టి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇక మూడవ వర్గం కోమటిరెడ్డి బ్రదర్స్ కి చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీ. నిజానికి ఈ సుశీ ఇన్ఫ్రా కంపెనీపై గతంలో విజిలెన్స్ ,ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగాయి. ఈ సంస్థపై ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్ల కోసం తెలంగాణలో మూడు బలమైన వర్గాలు నైనీ బొగ్గు గనిని వాళ్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లకు ఉన్నాయి.నైనీ బొగ్గు గని టెండర్ల నుంచి మిగిలిన వాళ్ళని పక్కకు తప్పించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డు పేరిట ఒక కథనం ప్రసారమైంది. ఒక మంత్రిగారు… మహిళా అధికారులకు వ్యక్తిగత లాభం చేకూర్చారంటూ ఒక కథనం ప్రసారం అయింది.2025 అక్టోబర్ 26న ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు కథనంలోనూ ఇదే విషయాన్ని రాశారు. కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకుంటున్నారు అని రాశారు. కానీ అప్పట్లో ఇది పెద్దగా బయటకు రాలేదు. ఎన్టీవీ కథనం పై నానా రచ్చ జరిగింది. మహిళా ఐఏఎస్ లను అవమానించారు అంటూ కేసు నమోదు అయింది. ప్రభుత్వం దీనిపై సిట్ వేసింది. పోలీసులు అత్యుత్సాహంతో ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశారు. కానీ బాధితులే లేని ఈ కేసులో జర్నలిస్టులు నిందితులు ఎలా అవుతారంటూ కోర్టు బెయిల్ ఇచ్చింది.
బొగ్గు గని దక్కించుకోవడానికి మంత్రులపై కథనాలు రాయిస్తున్నారంటూ పరోక్షంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టినీ టార్గెట్ చేస్తూ పత్రికల్లో వార్తలు వచ్చింది. వెంటనే బట్టి నైనీ బొగ్గు గని టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైట్ విజిట్ కండిషన్ అనేది తాను పెట్టలేదని అది ఎప్పటి నుంచో ఉన్నదేనని ఆధారాలతో సహా బయటపెట్టారు.బొగ్గు గని వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే నాలుగు రోజులు ఆలస్యంగా నైనా నైని బొగ్గు గాని ఎవరికి దక్కుతుందో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆర్ మహేష్ రెడ్డి కట్ట పెడతారా, ?డిప్యూటీ సీఎం బట్టి మెగా కృష్ణారెడ్డి అండ్ టీం కి ఈ గని అప్పగిస్తారా?కోమటిరెడ్డి బ్రదర్స్ కి చెందిన సుశీ ఇన్ఫ్రాకి ఈ బొగ్గు గని నీ సాధించి పెడతారా అన్నది మరి కొన్నాళ్ళకు తేలుతుంది.కాకపోతే ఎపిసోడ్ తో ఏ సంబంధం లేని ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు అల్లరి పాలయ్యారు. పరోక్షంగా పరువు పోగొట్టుకున్నారు. తమకు తెలియకుండానే ఈ వివాదంలో భాగం అయిపోయారు. పోలీస్ కేసులను ఎదుర్కొన్నారు. నైనీ బొగ్గు గని చుట్టూ తెలంగాణ రాజకీయాన్ని నడిపిస్తున్న లీడర్లు, పారిశ్రామిక వేత్తలు, మీడియా అధిపతులు మాత్రం ఇంకా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూనే ఉన్నారు.











