ఇండియాలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్ళే.. టాప్ షారుక్ ఖాన్.. టాలీవుడ్ నెంబర్ 1 కింగ్..!

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అదొక భారీ వ్యాపార సామ్రాజ్యం. నేడు భారతీయ సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్‌కి వెళ్ళింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2026 | 07:20 PMLast Updated on: Jan 29, 2026 | 7:20 PM

These Are The Wealthiest Actors In India Shah Rukh Khan Is At The Top And The Number 1 In Tollywood Is King

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అదొక భారీ వ్యాపార సామ్రాజ్యం. నేడు భారతీయ సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్‌కి వెళ్ళింది. మన హీరోలు కేవలం సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మీద మాత్రమే ఆధారపడకుండా.. నిర్మాణ సంస్థలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పోర్ట్స్ టీమ్స్, ఇతర బిజినెస్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. తాజాగా విడుదలైన టాప్-10 రిచెస్ట్ ఇండియన్ హీరోల జాబితా దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నంబర్ 1 స్థానంలో నిలిచి తన సత్తా చాటారు. ఆయన నెట్ వర్త్ ఏకంగా రూ. 12,931 కోట్లుగా నమోదైంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, ఐపీఎల్ టీమ్ వంటి భారీ వ్యాపారాలు షారుఖ్ ఆస్తిని ఇంతలా పెంచాయి. మిగతా హీరోలతో పోలిస్తే షారుఖ్ ఆస్తి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండటం  విశేషం.

రెండో స్థానంలో మన కింగ్ నాగార్జున అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన హీరోగా నిలిచారు. ఆయన సంపద సుమారు రూ. 5,000 కోట్లు. అన్నపూర్ణ స్టూడియోస్, మీడియా స్కూల్స్, ఎన్-కన్వెన్షన్ వంటి వ్యాపారాలతో పాటు.. రియల్ ఎస్టేట్ రంగంలో నాగార్జునకు ఉన్న పట్టు ఆయనను ఈ స్థానంలో నిలబెట్టింది. ఇక ఆ తర్వాతి బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ రూ. 3,225 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 3,100 కోట్లు, అక్షయ్ కుమార్ రూ. 2,250 కోట్లు, ఆమీర్ ఖాన్ రూ. 1,860 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు.

ఈ జాబితాలో తెలుగు హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రూ. 1,750 కోట్ల ఆస్తితో బలమైన స్థానంలో ఉండగా.. విక్టరీ వెంకటేష్ రూ. 1,650 కోట్లతో తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూ. 1,630 కోట్లతో టాప్-10లో చోటు సంపాదించుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ రూ. 1,680 కోట్లతో చిరంజీవి, వెంకటేష్ మధ్యలో నిలిచారు. మొత్తంగా చూస్తే టాప్-10 జాబితాలో నలుగురు తెలుగు హీరోలు ఉండటం మన ఇండస్ట్రీలో ఉన్న ఫైనాన్షియల్ బలాన్ని తెలియజేస్తోంది. షారుక్ మిగిలిన వాళ్ళకు అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ.. దక్షిణాది హీరోలు తమ బిజినెస్ తో బాలీవుడ్ స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉంది.