నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ 22వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో "మెగా" మరియు "పవర్ స్టార్" అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. "జూనియర్ పవర్ స్టార్" అంటూ అభిమానులు ఉదయం నుంచే పండగ చేసుకుంటున్నారు.
#HBDAkiraNandan, #JuniorPowerStar, #AkiraNandan వంటి ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అకీరా నందన్ ఎత్తు, వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను తలపించే అతని లుక్స్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్లను అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత సినిమాలలోని క్లిప్పింగ్స్‌ను అకీరా లేటెస్ట్ ఫొటోలతో కలిపి ఫ్యాన్స్ అద్భుతమైన ఎడిట్స్ చేస్తున్నారు.
అకీరా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న మరియు బాక్సింగ్ చేస్తున్న పాత వీడియోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అతని వర్కౌట్స్ చూసి "టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అకీరాకు సంగీతం అంటే ఉన్న ఇష్టాన్ని గుర్తు చేస్తూ, అతను పియానో వాయిస్తున్న వీడియోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ప్రతి ఏటా లాగే, అకీరా తల్లి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఇచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అకీరాకు ఫోటోలు దిగడం పెద్దగా ఇష్టం ఉండదని ఆమె గతంలో చెప్పినప్పటికీ, పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక అరుదైన ఫోటో లేదా ఎమోషనల్ వీడియో షేర్ చేయడం ఫ్యాన్స్‌కు కనువిందుగా మారింది.కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, జనసేనాని అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అనాధ శరణాలయాల్లో అన్నదానం.రక్తదాన శిబిరాలు.మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు అకీరాతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు అక్కినేని అఖిల్ పుట్టినరోజులు కూడా కావడంతో టాలీవుడ్ సోషల్ మీడియాలో ఇవాళ ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంది.