Alia Bhatt: పెళ్లి అయినా.. తల్లి అయినా.. అలియా అందం తగ్గలేదు

అలియా పెళ్లయి తల్లైన హీరోయిన్‌ అంటే నమ్మడం కష్టమే. ఓ ఈవెంట్లో ఈ అమ్మడు దేవకన్యలా దర్శనమిచ్చింది. ప్రియాంకచోప్రా... వంటి ఎందరో అందగత్తెలు వున్నా.. అందరి చూపు అలియా పైనే.

Post Published By: Srikar Creator
Updated : 2 May 2023, 9:30 PM IST

న్యూయార్క్‌లో జరుగుతున్న మెగా గాలా 2023 ఈవెంట్‌లో అలియాభట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరూ ఆమె కాస్ట్యూమ్‌ గురించే మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని షేర్‌ చేసి.. గౌను ప్రత్యేకతను రాసుకొచ్చింది అలియా. ఈ ఎంబ్రాయిడరీ గౌన్‌ను ఇండియాలోనే లక్ష ముత్యాలతో రూపొందించారని.. ఇది వేసుకుని.. రెడ్ కార్పెట్‌పై నడవడం సంతోషంగా వుందని పేర్కొంది అలియా.

Alia Bhatt

Alia Bhatt New York International Fashion Show

దేవకన్యలా కనిపిస్తున్ అలియా ముత్యాల కాస్ట్యూమ్‌ ముందు ప్రియాంకచోప్రా సైతం తేలిపోయారు. రెడ్ కార్పెట్‌పై ఐలవ్‌యూ టూ అంటూ కెమెరాకు ఫోజులిస్తూ.. సందడి చేసింది. అలియా ప్రస్తుతం కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ.. అమెరికన్‌ స్పై మూవీలో నటిస్తోంది. పెళ్లికి ముందే ఈ రెండు సినిమాలు ఒప్పుకున్న అలియా.. తల్లైన తర్వాత మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

ఎన్టీఆర్‌ కొరటాల సినిమాలో ముందుగా అలియానే అనుకున్నా.. ప్రెగ్నెంట్‌ కారణంగా తప్పుకుంది. దీంతో జాన్వీకపూర్‌ను సెలెక్ట్‌ చేశారు. తల్లైన తర్వాత ఏ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో వుంది. అయితే.. బ్రహ్మాస్త్ర2 ఇప్పట్లో మొదలుకాకపోవడంతో... మరో మూవీకి డేట్స్ ఇచ్చే అవకాశం వుంది.

Published : 
  • 2 May 2023, 9:30 PM IST