సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాలైతే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ డేటింగ్‌లో ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లన్నీ ఒక చిన్న సెల్ఫీతో మొదలయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఒక ప్రముఖ అవార్డు వేడుకలో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి సందడి చేశారు. ఆ సమయంలో ధ్రువ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుపమతో ఉన్న ఒక క్యూట్ సెల్ఫీని షేర్ చేశాడు.
అంతటితో ఆగకుండా, అనుపమ ఆ ఫోటోను తన స్టోరీలో రీ-షేర్ చేస్తూ 'హార్ట్ ఎమోజీ'ని జత చేసింది. ఈ చిన్న విషయం అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. 'వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది' అని నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే కేవలం ఫోటోలే కాదు, గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. 'బైసన్' అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం పెరిగిందని సమాచారం.
ఒక ఇంటర్వ్యూలో అనుపమని 'మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఎవరికి కాల్ చేస్తారు?' అని అడగ్గా, ఆమె ఏమాత్రం ఆలోచించకుండా 'నేను ధ్రువ్‌కి కాల్ చేస్తాను' అని సమాధానం ఇచ్చింది. అలాగే ధ్రువ్ కూడా ఒక స్టేజ్ మీద అనుపమకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ విష్ చేయగా, ఆమె సిగ్గుపడుతూ కనిపించడం ఈ రూమర్స్‌ను మరింత బలపరిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అనుపమ వయస్సు 30 ఏళ్లు, ధ్రువ్ విక్రమ్ వయస్సు 28 ఏళ్లు. అంటే అనుపమ ధ్రువ్ కంటే రెండేళ్లు పెద్దది. అయినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద మరియు ఆఫ్ స్క్రీన్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. 'వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే' అని సన్నిహితులు చెబుతున్నప్పటికీ, వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.