పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఆయన అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు. అయితే, తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించి, తన వ్యక్తిగత జీవితం మరియు పవన్‌తో ఉన్న బంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నా లెజినోవా చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో "Ask Me" సెషన్‌ను నిర్వహించారు. ఇందులో అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె చాలా ఓపికగా, చిరునవ్వుతో సమాధానాలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక అభిమాని "వదినమ్మ గారు, మీ ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు చేశారా లేక మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చేశారా?" అని అడిగారు. దీనికి అన్నా లెజినోవా ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చారు."మీ అన్నయ్యే మొదట నాకు ప్రపోజ్ చేశారు" అని ఆమె క్లారిటీ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ వంటి సైలెంట్ వ్యక్తి, తన ప్రేమను ముందుగా వ్యక్తం చేశారనే విషయం విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్‌లోని రొమాంటిక్ యాంగిల్ గురించి అన్నా చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అన్నా లెజినోవా విదేశీయురాలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు ఎన్ని భాషలు తెలుసనే ప్రశ్న కూడా ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ.. తనకు మొత్తం 6 భాషలు వచ్చని పేర్కొన్నారు. అయితే, మాట్లాడటానికి మాత్రం తాను ఇంగ్లీష్ భాషలోనే ఎక్కువగా సౌకర్యంగా ఫీల్ అవుతానని వెల్లడించారు.
అన్నా లెజినోవాకు తెలుగు భాష పట్ల ఎంత గౌరవం ఉందో ఆమె మాటల్లో స్పష్టమైంది. "మీకు తెలుగు ఇష్టమేనా?" అని అడిగిన ప్రశ్నకు ఆమె చాలా సానుకూలంగా స్పందించారు.తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని చెప్పారు.ప్రస్తుతం తాను తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు.ప్రతిరోజూ కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంటూ, భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అన్నా లెజినోవా తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ, మన భాషను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం పట్ల పవన్ అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక విదేశీయురాలిగా ఉండి కూడా, ఇక్కడి సంస్కృతిలో కలిసిపోవడం నిజంగా అభినందనీయమని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అన్నా లెజినోవా చేసిన ఈ ఇంటరాక్షన్ ద్వారా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మరిన్ని విషయాలు బయటకి వచ్చాయి. ముఖ్యంగా పవనే ఫస్ట్ ప్రపోజ్ చేశారని తెలియడం అభిమానులకు ఒక స్వీట్ సర్ ప్రైజ్ అని చెప్పాలి. ప్రస్తుతం అన్నా లెజినోవా షేర్ చేసిన ఈ స్టోరీ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.