అవతార్ 3… ఓటీటీ విడుదల!

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం 'అవతార్'. 2009లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Post Published By: dialnews
Updated : 14 May 2026, 4:44 PM IST

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం 'అవతార్'. 2009లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2022లో వచ్చిన 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్' ఏకంగా 18 వేల కోట్లకు పైగా వసూలు చేసి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది.

ఈ సిరీస్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 19న విడుదలైన మూడవ భాగం 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జేమ్స్ కామెరూన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏమాత్రం రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 3300 కోట్లు.

సామ్ వర్తింగ్టన్, జో సాల్డానా, సిగుర్నీ వీవర్ వంటి హేమాహేమీలు ప్రధాన పాత్రల్లో నటించగా, సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతం అందించారు.
తొలుత మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్ మరియు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలలో అద్దె ప్రాతిపదికన కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ 24 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో భారతీయ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Published : 
  • 14 May 2026, 4:44 PM IST