సుజీత్ మరో సునామీ… బ్లడీ రోమియో…!

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన 'బ్లడీ రోమియో' సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది."నేచురల్ స్టార్ నాని బర్త్‌డే ట్రీట్ నిజంగా మామూలుగా లేదు!

Post Published By: dialnews
Updated : 25 February 2026, 1:20 PM IST

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన 'బ్లడీ రోమియో' సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది."నేచురల్ స్టార్ నాని బర్త్‌డే ట్రీట్ నిజంగా మామూలుగా లేదు! ఒకవైపు 'ది ప్యారడైజ్' రాంపేజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే, మరోవైపు 'ఓజీ' డైరెక్టర్ సుజీత్‌తో తన క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. నాని 42వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు ఒక స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ సినిమా కాబోతోంది.

విడుదలైన గ్లింప్స్‌లో నాని ఒక 'చెఫ్' లాగా కనిపిస్తూనే, లోపల ఒక పవర్‌ఫుల్ 'గ్యాంగ్‌స్టర్' అని రివీల్ చేశారు. ఒక గ్యాంగ్‌స్టర్ అడ్డాలో నాని ఉల్లిపాయలు కోస్తూ, వెల్లుల్లిని దంచుతూ వంట చేస్తున్నట్లు చూపించారు. కానీ చివరలో ప్రెజర్ కుక్కర్‌పై గ్రెనేడ్ పెట్టి ఆ బిల్డింగ్‌ను పేల్చేసి, స్టైల్‌గా బయటకు రావడం అదిరిపోయింది. "He is No.1 Chef" అని రాసి, 'Chef' అనే పదాన్ని కొట్టేసి "He is No.1 Gangster" అని చూపించడం ఈ సినిమా థీమ్‌ను చెబుతోంది. 'సాహో', 'ఓజీ' సినిమాలతో సుజీత్ తన విజువల్ స్టైల్ ఏంటో చూపించాడు. ఇప్పుడు నానిని కూడా అదే రేంజ్‌లో ఒక 'విట్టీ అండ్ స్టైలిష్' గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడు. ఈ గ్లింప్స్‌లో వినిపించిన "No.1 Gangsta" సాంగ్ చాలా మోడ్రన్ బీట్స్‌తో ఉంది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 2026 వేసవిలో ప్రారంభం కానుంది. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో నాని మార్క్ హ్యూమర్, యాక్షన్ మరియు లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నాయని నాని తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "హాయ్ నాన్న, హిట్ 3 లాంటి హిట్లతో జోరు మీదున్న నానికి సుజీత్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే...

Published : 
  • 25 February 2026, 1:20 PM IST