షేక్ చేస్తోన్న దురంధర్ ది రివేంజ్…!

పాన్ ఇండియా లెవెల్ లో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన.. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన "దురంధర్ 2: ది రివెంజ్" నేడు, ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Post Published By: dialnews
Updated : 19 March 2026, 1:25 PM IST

పాన్ ఇండియా లెవెల్ లో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన.. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన "దురంధర్ 2: ది రివెంజ్" నేడు, ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభమవుతుంది. జస్కరీత్ సింగ్ రంగీ అలియాస్ హంజా అలీ మజారీ పాకిస్తాన్ అండర్ వరల్డ్ లోకి చొచ్చుకుపోయి, అక్కడి ఉగ్రవాద నెట్‌ వర్క్‌ ను ఎలా అంతం చేశాడనేది ప్రధాన ఇతివృత్తం.

ఈ క్రమంలో హంజా ఎదుర్కొన్న వ్యక్తిగత నష్టాలు, దేశం కోసం అతను చేసిన పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రణవీర్ సింగ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. హంజా పాత్రలో రణవీర్ చూపిన వీరత్వం, భావోద్వేగాలు, యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ఈ పాత్ర కోసం రణవీర్ తన శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు, పొడవాటి జుట్టుతో భిన్నమైన లుక్‌ లో కనిపించాడు.

ఆదిత్య ధర్ తన మేకింగ్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులను ప్లాన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. అర్జున్ రాంపాల్.. మేజర్ ఇక్బాల్‌ గా ఆకట్టుకున్నాడు. సంజయ్ దత్.. అస్లాం చౌదరి పాత్రలో నటనతో ఆకట్టుకోగా, ఆర్. మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా లెవెల్ ను పెంచాయనే టాక్ వినపడుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్ సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. మొత్తానికి, దురంధర్ 2 ఒక పవర్‌ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, దేశభక్తిని ప్రేరేపించే చిత్రంగా నిలిచింది. రణవీర్ సింగ్ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక ఫీస్ట్ అంటున్నారు ఆడియన్స్.

Published : 
  • 19 March 2026, 1:25 PM IST