గ్లోబల్ ఐకాన్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ డార్లింగ్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచంలోనూ ఒక సంచలనానికి తెరలేపారు. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం కోకాపేటలో ప్రభాస్ ఒక భారీ లగ్జరీ మేన్షన్ను నిర్మిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు జూబ్లీహిల్స్‌లో ఉంటూ వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు కోకాపేటకు తన మకాం మార్చడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలు ఇప్పటికే ఈ ఏరియాకు షిఫ్ట్ అయిపోయారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి పాత ఎలైట్ ఏరియాల కంటే ఇప్పుడు కోకాపేటలో పెద్ద ప్లాట్లు, అత్యాధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత దగ్గరగా ఉండటంతో పాటు, సెలబ్రిటీలకు కావలసినంత ప్రైవసీ ఇక్కడ లభిస్తుంది. ప్రభాస్ రాకతో ఈ చుట్టుపక్కల భూముల ధరలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంతోమంది సంపన్న కొనుగోలుదారులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు క్యూ కడుతున్నారు.సినీ సెలబ్రిటీ ఒక ఏరియాలో ఇల్లు కడుతున్నారంటే.. ఆ ప్రాంతం వాల్యూ అమాంతం పెరిగిపోవడం సహజం. కోకాపేట, ముఖ్యంగా 'నియోపోలిస్' ఏరియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు ఇప్పుడు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కేవలం ప్రభాస్ వ్యక్తిగత ఇల్లు మాత్రమే కాదు.. టాలీవుడ్ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్ అని చెప్పొచ్చు. ఇది భారతీయ సినిమా ఎదుగుదలకు, మన స్టార్ల అంతర్జాతీయ రేంజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రభాస్‌కు లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అందుకే ఆయన కార్ల కలెక్షన్ కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్పేస్ కేటాయిస్తున్నారు. ప్రభాస్ ఇచ్చే విందులు, ఆయన ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. తన స్నేహితులు, తోటి నటీనటుల కోసం భారీ విందులు ఇచ్చేందుకు వీలుగా ఒక పెద్ద డైనింగ్ హాల్, అత్యాధునిక కిచెన్‌ను ప్లాన్ చేశారట. వర్కౌట్స్ కోసం ఒక లగ్జరీ జిమ్, అలాగే సినిమాలు చూసేందుకు ఒక భారీ హోమ్ థియేటర్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. సిటీ గొడవలకు దూరంగా ప్రశాంతతను పంచే గార్డెన్స్, ఇంటిని ఆపరేట్ చేయడానికి లేటెస్ట్ స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతున్నారు.ఈ ఇంటి విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇంటి పనులు పూర్తయితే.. కోకాపేటలో ఇదొక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలవడం ఖాయం. ప్రభాస్ కేవలం తన సినిమాలతోనే కాదు, తన లైఫ్ స్టైల్‌తో కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మన డార్లింగ్ సక్సెస్‌కు, ఆయన రేంజ్‌కు ఈ ఇల్లు ఒక సజీవ నిదర్శనం. ప్రభాస్ కెరీర్లో, వ్యక్తిగత జీవితంలో ఇదొక సరికొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. డార్లింగ్ కొత్త ఇంటిని ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.