7 అడుగుల వెనక.. 7 యుద్ధాలు.. లెగ్గు మహత్యం..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. ఇదే మ్యారేజ్ రెండు, మూడేళ్ల క్రితం జరిగి ఉంటే, దేశ శ్యాప్తంగా క్రికెట్ ధోని పెల్లి స్థాయిలో హంగామా జరిగి ఉండేది..

Post Published By: dialnews
Updated : 28 February 2026, 9:30 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. ఇదే మ్యారేజ్ రెండు, మూడేళ్ల క్రితం జరిగి ఉంటే, దేశ శ్యాప్తంగా క్రికెట్ ధోని పెల్లి స్థాయిలో హంగామా జరిగి ఉండేది.. కాని ఈ పాన్ ఇండియా రౌడీగా మారాల్సిన విజయ్ తో ఏడడుగులు వేయటానికి రష్మిక ఏడు యుద్దాలే చేయాల్సి వచ్చింది. లైగర్ తో సీన్ రివర్స్ అయ్యింది కాని, అదే కనుక హిట్టైతే, పాన్ ఇండియా లెవల్లో ఏకంగా, ప్రభాస్, ఎన్టీఆర్ అండ్ కో పేర్ల లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు కూడా చేరిపోయేది... కాని లైగర్ తోనే విజయ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. రష్మిక మాత్రం పాన్ ఇండియాని షేక్ చేస్తూ ఎదిగిపోయింది. ఈ ప్రాసెస్ లోనే ఈ జంట ఏడడుగుల వెనక ఏడు యుద్దాలే జరిగాయని తెలుస్తోంది.. దీనికి తోడు ఇప్పుడు విజయ్ విషయంలో రష్మిక ఎనిమిదో యుద్దం చేయాల్సి వస్తోంది.. అదే ఈ గీత వచ్చి గోవిందం తలరాత మారుస్తుందా అనే ప్రశ్న..?కన్నడలో ఐరన్ లెగ్గనిపించుకున్న రష్మిక తెలుగులోకొచ్చాకే గోల్డెన్ లెగ్ గా మారిందన్నారు.. మరి విజయ్ విషయంలో కూడా అదే జరగబోతోందా?

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి మీడియాకు పెద్ద న్యూస్.. కాని రౌడీ స్టార్ విజయ్ కి ఫ్యాన్స్ ని మించి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువున్నారు. దానికి తగ్గట్టే లైగర్ నుంచి వరుస ఫ్లాపులే... అందుకే ఇప్పడు రష్మిక తో తనపెళ్లి కూడా మీడియాలో తప్ప, సోషల్ మీడియాలో కాని మరెక్కడా కాని అంతగా హాట్ టాపిక్ కాలేదు. ఇది ముందే ఊహించాడో లేదంటేమెంటల్ హెల్త్ పాడు చేసుకోవటం ఎందుకని, పీస్ ఫుల్ సెరమనీని, మరింత పీస్ ఫుల్ గా మార్చాలనుకున్నాడో.. పెద్దగా హంగామా లేకుండా రష్మికతో ఏడడుగులు నడిచాడు విజయ్..కానీ ఈ ఇద్దరి ఏడడుగలు పడేందుకు ఏడు యుద్ధాలే చేయాల్సి వచ్చిందని ఎంతమందికి తెలుసు..ముందు పెద్ద యుద్ధం గీత గోవిందం టైంలో జరిగింది. రష్మిక తన యంగేజ్ మెంట్ ని బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి విజయ్, రష్మిక కేవలం స్నేహితులే.. తర్వాతే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందంటారు.. నిజానికి 2017 లో కిరిక్ పార్టీ మూవీ చేసేప్పుడు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటం, యంగేజ్ మెంట్ అవటం జరిగింది.

వ్యక్తిగత విభేదాలతో ఆ యంగేజ్ మెంట్ తర్వాత ఇద్దరు విడపోయారు. కట్ చేస్తే అప్పుడే గీతగోవిందం తో రౌడీతో రష్మిక స్నేహం, కుదరింది. తర్వాతే హిట్ పేయిర్ గా మారిన ఈ ఇద్దరు, డియర్ కామ్రెడ్ తో ప్రేమలో పడ్డారంటారు. ఏదేమైనా, కన్నడ వాసి అయినా రష్మిక రక్షిత్ శెట్టి తో బ్రేకప్ తర్వాత శాండిల్ వుడ్ లో విలన్ గా మారింది. ఎవరిమీదో కోపంతో రష్మిక ఇచ్చిన కొన్ని ఎక్స్ ప్రెషన్స్ కి కన్నడ జనం ఫైర్ అయ్యారు.తర్వాత విజయ్ దేవరకొండ విషయానికొస్తే పెళ్లిచూపుల నుంచి లైగర్ కి ముందు వరకు చూస్తుండగానే శిఖరంలా ఎదిగాడు. కట్ చేస్తే లైగర్ తో ఫ్లాపుల మొత మొదలు.. అంతే తనేం చేసినా ఫ్లాపవ్వటమే కాదు, ఒకసారి ఎన్టీఆర్ మూవీతో పోటీ పడబోయి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి కార్నర్ అయ్యాడు. జర్నలిస్టులతో ఫ్రీగా మాట్లాడబోయి, యారెగెంట్ అనిపించకుున్నాడు. ఇలా తనేం మాట్లాడినా బూతే, ఏం చేసినా వివాదమే అన్నట్టు యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ జరిగింది.

నార్త్ ఇండియాలో అయితే అసలు విజయ్ సౌత్ లో పెద్ద సూపర్ స్టారేం కాదు, మీడియం రేంజ్ స్టారే అనేంతగా తనని అక్కడి మీడియా తక్కువ చేయటం కూడా కనిపించింది. ఇలాంటి క్రిటిసిజమ్ ఎంత జరిగినా, విజయ్ ఎంత నలిగినా, రష్మికా అదే సమయంలో ఎదుగుతుంటే, గర్ల్ ఫ్రెండ్ చాటు ప్రేమికుడిగా తన మీద కామెంట్ల దాడి జరిగినా, వీల్ల ప్రేమ పెల్ల పీటల వరకు వచ్చింది. ఏదేమైనా రష్మిక బ్యాడ్ టైంలో విజయ్ తోడున్నాడు.మనో బలాన్నిచ్చాడు. అలానే రౌడీ స్టార్ కెరీర్ వీకైనప్పుడు, యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నప్పుడు కూడా రష్మిక అంతే ఓర్పుతో, ఈ రిలేషన్ షిప్ ని పెళ్లి పీటల వరకు తీసుకురాగలిగింది. ఇక ఇప్పుడు మారాల్సింది విజయ్ లైఫే.. సో ఈ గీత వచ్చాక గోవింతం తలరాత మారుతుందా? తనది ఐరన్ లెగ్గో గోల్డెన్ లెగ్గో అనే డిస్కర్షన్ కాకుండా, ఈ జంట పర్సనల్ గా బెటర్ లైఫ్ నీ లీడ్ చేస్తూనే, ప్రొఫేషనల్ గా దూసుకెళుతుందా? ఈ ప్రశ్నలకు పాజిటివ్ సమాధానాలు రాబట్టేంటే మెంటల్ మెచ్చూరిటీ ఉన్న జంటే కాబట్టి, దేకెన్ డూ ఇట్.. ఏదేమైనా ఆఫ్టర్ మ్యారేజ్ వీల్ల కొత్త ఇన్నింగ్స్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ మాత్రం జనాల్లో పెరిగింది.

Published : 
  • 28 February 2026, 9:30 PM IST